Home » పట్టుమ‌ని పాతికేళ్లు నిండ‌కుండానే పెళ్లి చేసుకున్న 10 మంది స్టార్ హీరోయిన్ లు వీళ్లే..!

పట్టుమ‌ని పాతికేళ్లు నిండ‌కుండానే పెళ్లి చేసుకున్న 10 మంది స్టార్ హీరోయిన్ లు వీళ్లే..!

by AJAY
Ad

సాధార‌ణంగా సినిమా హీరోయిన్ లు ఆఫ‌ర్ లు పూర్తిగా త‌గ్గిపోయిన త‌ర‌వాత పెళ్లి గురించి ఆలోచిస్తారు. కొంద‌రు అయితే పూర్తిగా పెళ్లికి దూరంగా ఉంటారు. కానీ అతికొద్ది మంది హీరోయిన్ లు 20 ఏళ్లు కూడా రాకుండానే పెళ్లిచేసుకున్నారు. ఆ హీరోయిన్ లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం…అఖిల్ సినిమాలో హీరోయిన్ గా న‌టించిన స‌యేషా సైగ‌ల్ 20 ఏళ్ల‌కే పెళ్లి చేసుకుంది.

Advertisement

ఈ ముద్దుగుమ్మ త‌మిళ హీరో ఆర్య‌ను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యింది. హీరోయిన్ న‌జ్రియా నాజిమ్ కూడా చిన్న‌వ‌య‌సులోనే పెళ్లి చ‌సుకుంది. కేవ‌లం 20 ఏళ్ల లోపు వ‌య‌సులోనే న‌జ్రియా న‌టుడు ఫ‌హద్ ఫాజిల్ ను వివాహం చేసుకుని అంద‌ర్నీ అవాక్క‌య్యేలా చేసింది.

also read : ఒకే ఇంట్లో ఉంటున్న‌ విజ‌య్ ర‌ష్మిక‌…ఆ ఫోటోతో అడ్డంగా బుక్కైన ల‌వ్ బ‌ర్డ్స్..?

Advertisement

ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ దివ్య భార‌తి 18 ఏళ్ల వ‌య‌సులోనే షాజిద్ అనే వ్య‌క్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ చిన్న‌వ‌య‌సులోనే ఈ హీరోయిన్ భ‌వ‌నం పై నుండి కింద‌ప‌డి చ‌నిపోయింది. ఇదిలా ఉంటే హీరోయిన్ అదితిరావు హైద‌రీ 24 ఏళ్ల వ‌య‌సులోనే పెళ్లి చేసుకుంది. కానీ ఆ త‌ర‌వాత మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డంతో భ‌ర్త‌తో విడాకులు తీసుకుంది.

ఇక హీరోయిన్ జ‌నీలియా కూడా 24 ఏళ్ల వ‌య‌సులోనే హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకుంది. త‌మిళ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ సార్దిక వివాహం చేసుకున్నార‌న్న సంగ‌తి తెలిసిందే. కాగా పెళ్లి స‌మ‌యంలో సార్దిక వ‌య‌సు కేవ‌లం పాతికేళ్ల లోపే ఉంటుంద‌ని కొద్దిమందికి మాత్ర‌మే తెలుసు.

హీరో అజిత్ హీరోయిన్ షాలినిని పెళ్లి చేసుకున్నాడు. కాగా అప్పుడు షాలిని వయ‌సు కేవ‌లం 21 ఏళ్లు మాత్ర‌మే. అదే విధంగా హీరోయిన్ శ్రీదేవి విజ‌య్ కుమార్, మల్లికా శ‌రావ‌త్, రాధిక అప్టే, అమ‌లా పాల్ లు కూడా పాతికేళ్లు నిండ‌కుండానే పెళ్లి చేసుకున్నారు.

ALSO READ : నా నెక్స్ట్ మూవీ ఇలా ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చిన బలగం వేణు..!!

Visitors Are Also Reading