Home » శీతాకాలంలో ఈ పండ్లు తిన్నారంటే వ్యాధులు పరార్..!!

శీతాకాలంలో ఈ పండ్లు తిన్నారంటే వ్యాధులు పరార్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

శీతాకాలం వచ్చిందంటే చాలు అనేక వ్యాధులు బయటకు వస్తాయి. ముఖ్యంగా చలికాలంలో జలుబు,దగ్గు, కఫంతో పాటుగా జ్వరం కూడా వస్తూ ఉంటుంది. ఇవి రావడానికి ప్రధాన కారణం వాతావరణంలో జరిగినటువంటి మార్పులు. శీతాకాలంలో వైరస్ లు, బ్యాక్టీరియాలు అనేవి ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల ఈ వ్యాధులు మన దరి చేరుతాయి. అయితే ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే మనం రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలి. అలాగే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల సీజనల్ వ్యాధుల నుండి మనం బయటపడవచ్చు.. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

శీతాకాలం వచ్చిందంటే చాలు అంజీర్ పండ్లను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిలో ఉండేటువంటి ఔషధ గుణాలు మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో ఎక్కువగా క్యాల్షియం, ఐరన్,మెగ్నీషియం,ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజా లవనాలు ఉంటాయి. అంతేకాకుండా అత్తిపండ్లలో ప్రోటీన్,ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్ ఏ,బి విరివిగా ఉంటాయి. ఇది జలుబు, ఫ్లూ వంటి వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది.

Advertisement

also read:మెట్రో ట్రాకుల మధ్య రాళ్లు ఎందుకు ఉండవో తెలుసా..?

Advertisement

చలి ఉండదు:

అత్తి పండ్లను తినడం వల్ల చలి దూరమవుతుంది. ఎందుకంటే అత్తిపండ్లలో వేడెక్కించే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో ఈ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది.
శ్వాసకోస వ్యాధులు దూరం :

ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల ఇందులో ఉండేటువంటి పోషకాలు శ్వాసకోశ వ్యాధులను దూరం చేసి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్z క్యాల్షియం, ప్రోటీన్లు కఫం, గొంతు నొప్పి వంటివి రాకుండా చూసుకుంటాయి. దీనివల్ల దగ్గు కూడా రాదు.

చర్మానికి ఎంతో మేలు:
శీతాకాలంలో ఎక్కువగా చర్మం పొడిబారుతుంది. కాబట్టి అంజీర్ పండ్ల లో ఉండే విటమిన్ సి, విటమిన్ ఈ పోషకాలు చర్మాన్ని తేమగా మార్చడానికి పనిచేస్తాయి. పొడి చర్మం నుండి బయటపడడానికి అత్తి పండ్లు తింటే మంచిది.

also read:

Visitors Are Also Reading