Home » టాలీవుడ్ లో దారుణ‌మైన ఫ్లాప్ ల‌ను తీసిన‌ 5గురు స్టార్ డైరెక్ట‌ర్ లు..!

టాలీవుడ్ లో దారుణ‌మైన ఫ్లాప్ ల‌ను తీసిన‌ 5గురు స్టార్ డైరెక్ట‌ర్ లు..!

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులు సర్వసాధారణం. స్టార్ హీరోలైనా స్టార్ దర్శకులైనా ఎప్పుడో ఒకప్పుడు ఫ్లాప్ ను చూడాల్సి వస్తుంది.

Advertisement

అలానే టాలీవుడ్ లోని కొంతమంది స్టార్ డైరెక్టర్లు కూడా దారుణమైన ఫ్లాప్ లను చూశారు. ఆదర్శకులు ఎవరు అలా అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటి అన్న సంగతి ఇప్పుడు చూద్దాం…


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో అత్తారింటికి దారేది సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లోనే అజ్ఞాతవాసి సినిమా వచ్చింది. కానీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.

కొరటాల శివ ఆచార్య సినిమాకు ముందు ఫ్లాప్ ఎరగని దర్శకుడుగా పేరు సంపాదించుకున్నారు. కానీ చిరంజీవితో తెరకెక్కించిన ఆచార్య సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

Advertisement


మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమా అంటే ప్రేక్షకులకు ఒక ఊపు వస్తుంది. పలువురు స్టార్ హీరోలకు బోయపాటి శ్రీను సూపర్ హిట్లను అందించారు. కానీ రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెర‌కెక్కిన వినయ విధేయ రామ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.

ప్రభాస్ హీరోగా తెర‌కెక్కిన‌ బిల్లా సినిమా సూపర్ హిట్ గాని నిలిచింది. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ ఎన్టీఆర్ తో శక్తి సినిమాను తెరకెక్కించారు. ఇది ఎన్టీఆర్ కెరీర్ లోనే దారుణమైన ఫ్లాప్ గా నిలిచింది.

 

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో బ్రహ్మోత్సవం సినిమా వచ్చింది. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో దారుణమైన ఫ్లాప్ గా నిలిచింది.

ALSO READ: చైతూ త‌ల్లి ద‌గ్గుబాటి ల‌క్ష్మి గురించి ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాలు..? నాగార్జునతో ఎందుకు విడిపోయారంటే..!

Visitors Are Also Reading