Telugu News » Blog » Astrology: ఈ రాశుల వారు ఎలాంటి ప‌రిస్థితిల్లోనైనా ఏ విష‌యాన్ని అయినా డీల్ చేస్తారు

Astrology: ఈ రాశుల వారు ఎలాంటి ప‌రిస్థితిల్లోనైనా ఏ విష‌యాన్ని అయినా డీల్ చేస్తారు

by Anji
Published: Last Updated on

ప‌రిస్థితులు ఎప్పుడు ఒకే విధంగా ఉండ‌వు. ఒక్కోసారి స‌మస్య‌లు ఎదుర‌వుతాయి. అలాంట‌ప్పుడు నిగ్ర‌హం కోల్పోకూడ‌దు. చ‌క్క‌గా డీల్ చేసే రాశులు 5 ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.


కొంత మంది ఎప్పుడూ త‌న మాటే నెగ్గాల‌నే ధోర‌ణి ఉంటే.. ఇత‌రులు దూర‌మ‌వుతారు. ఆ విధంగా కాకుండా అవ‌త‌లి వారి వెర్ష‌న్ ఏమిటో కూడా తెలుసుకుంటే.. అప్పుడు ఆ విష‌యంపై సంపూర్ణ అవ‌గాహ‌న వ‌స్తుంది. రెండు వైపులా ఆలోచించే వారు ప‌రిస్థితుల‌ను చ‌క్క‌గా స‌రిదిద్ద‌గ‌ల‌రు. కొంత మంది అలా ఆలోచించ‌లేరు. అవ‌స‌రం అయితే ఓ మెట్టు దిగుతారు కూడా. వీరి ఎమోష‌న‌ల్ ఇంటెలిజెన్స్ వీరికి విజ‌యాలు తెచ్చిపెడుతూ ఉంటుంది. ఆ 5 రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మీన రాశి

ఈ రాశి వారు నాయ‌కులుగా ఉండే కంపెనీలు, సంస్థ‌లు త్వ‌ర‌గా డెవ‌ల‌ప్ అవుతాయి. ఎందుకంటే ఈ రాశి వారు త‌మ అభిప్రాయ‌మే కాదు ఇత‌రుల అభిప్రాయాన్ని క‌చ్చితంగా లెక్క‌లోకి తీసుకుంటారు. వారు చెప్పేది వింటారు స‌హ‌నం ఉంటుంది. వెంట‌నే ఏ నిర్ణ‌య‌మూ తీసుకోరు. అన్ని వైపులా బాగా లోతుగా ఆలోచించి అప్పుడు మాత్రం ప్ర‌క‌ట‌న చేస్తుంటారు. ఆ ప్ర‌క‌ట‌న అంద‌రికీ న‌చ్చే విదంగా ఉంటుంది. ఇలా ఆలోచించేలా చేయ‌డానికి వీరు ఎమోష‌న‌ల్ ఇంటెలిజెన్స్‌ను బాగా ఉప‌యోగిస్తారు.

కర్కాట‌క రాశి

ఈ రాశి వారిలో ఓ ర‌క‌మైన పిరికిత‌నం ఉంటుంది. అది వీరికి క‌లిసొస్తుంది. అందుకే వీరు ఆధిపత్యం ప్ర‌ద‌ర్శించేందుకు సిద్ధ ప‌డ‌రు. ఎవ‌రైనా స‌మ‌స్య‌లో ఉన్న‌ప్పుడు వీరు లోతుగా అర్థం చేసుకుంటారు. అంతే గానీ ఒక వైపే ఆలోచిస్తూ.. స‌మ‌స్య‌ను మ‌రింత పెంచ‌రు. ఒక్కోసారి స‌మస్య‌లో ఉన్న వారిని బ‌య‌ట‌ప‌డేసేందుకు త‌మ‌కు మించిన సాహ‌స‌మే చేస్తారు. స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌డంలో వీరిది మ‌రొక ర‌క‌మైన ఎమోష‌న‌ల్ ఇంటెలిజెన్స్ సైలెంట్‌గా ప‌నైపోతుంది. ఇలా చేయ‌డం మిగ‌తా రాశుల వారికి క‌ష్టం.

తుల‌రాశి

ఏ స‌మ‌స్య వ‌చ్చినా వీరు రెండు వైపులా బ్యాలెన్స్ చేస్తుంటారు. చాలా ప్రాక్టిక‌ల్ విధానంలో ప‌రిష్క‌రిస్తారు. ఎవ‌రికీ అన్యాయం జ‌ర‌గ‌కూడ‌ద‌నే ఆలోచ‌న వీరికి ఉంటుంది. ఎవరికైనా క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు దానిని త‌మ క‌ష్టంగా భావిస్తూ బాగా ఫీల్ అవుతారు. ఈ రాశి వారు ఫ‌లితంగా ఆ క‌ష్టం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు బాగా శ్ర‌మిస్తారు.

వృశ్చిక రాశి

ఈ రాశి వారి ప్ర‌వ‌ర్త‌న చాలా చిత్రంగా ఉంటుంది. పైకి ఏమాత్రం ఎమోష‌న్స్ లేని వారిలా క‌ఠినంగా ఉన్న‌ట్టు కనిపిస్తారు. లోలోప‌ల మాత్రం ఎమోష‌న్స్ స‌ముద్ర‌మంత ఉంటాయి. వాటిని వీరు బాగా బ్యాలెన్స్ చేయ‌గ‌ల‌రు. వీరిలో మ‌రో గొప్ప ల‌క్ష‌ణ‌మేంటంటే ఇత‌రులు చెప్ప‌క‌పోయినా వారి మ‌న‌సులో భావో ద్వేగాల్ని ఈజీగా ప‌సిగ‌ట్టేస్తారు. వీరు త‌మ‌కు సాయం చేసేవారికి, త‌మ‌ను ప్రేమించే వారికి వంద‌శాతం అదే ప్రేమ‌ను రిట‌ర్న్ ఇవ‌వ్వ‌గ‌ల‌రు. త‌ద్వారా స‌మ‌స్య‌ల రాకుండా చేస్తారు. అదేవిధంగా తాము ప్రేమించే ఇత‌రుల నుంచి కూడా అదే 100 శాతం ప్రేమ‌ను కోరుకుంటారు.

క‌న్య‌రాశి

ఈ రాశి వారు నిబ‌ద్ధ‌తతో ఉంటారు. ముందుకు దూసుకెళ్లే విదంగా హార్డ్ వ‌ర్క్ చేస్తారు. వీరికి ఉండే ఎన‌లిటిక‌ల్ ఆలోచ‌న‌లు మిగ‌తా వారికి ఉండ‌వు. భావోద్వేగ అంశాల‌ను వీరు చాలా తేలిక‌గా సెటిల్ చేస్తారు. పెద్ద‌గా ఆలోచించ‌కుండానే ప‌రిష్కారం వచ్చే విధంగా చేస్తారు. వీరికి ప్యామిలితో ఉండ‌డం బాగా ఇష్టం. అందువ‌ల్ల కుటుంబ స‌భ్యులు, బంధువుల‌ను ప్రేమిస్తారు. వారి బాధ‌ల‌ను త‌మ బాధ‌లుగా మార్చుకుంటారు. త్వ‌ర‌గా ప‌రిష్కార‌మ‌య్యేవిధంగా ఎన‌లిటిక‌ల్ థింకింగ్‌తో ముందుకెళ్తారు.

 

You may also like