Telugu News » Blog » ఈ రాశుల వారు స్నేహానికి నిజమైన నిర్వ‌చ‌నం.. ఇందులో మీరున్నారా..?

ఈ రాశుల వారు స్నేహానికి నిజమైన నిర్వ‌చ‌నం.. ఇందులో మీరున్నారా..?

by Anji

స్నేహం అంటే చాలా మందికి ఎంతో న‌మ్మ‌కం ఉంటుంది. కుటుంబ స‌భ్యులు కొన్ని స‌మయాల్లో మ‌న‌ల్ని ఒంట‌రిగా చేసినా నేను ఉన్నానంటూ మ‌న‌క‌ష్టాల‌ను షేర్ చేసుకునే వాడే నిజ‌మైన ఫ్రెండ్‌. జ్యోతిష్య శాస్త్ర ప్ర‌కారం.. ఈ రాశుల వారు స్నేహానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. వీరు మ‌న‌కు ఫ్రెండ్స్‌గా ఉంటే మ‌నకు ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా వాటి నుంచి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డుతారు.

Ads

వృష‌భ రాశి :

ఈ రాశి వారు స్నేహం కోసం ప్రాణం ఇచ్చేందుకు కూడా వెనుకాడ‌రు. వీరితో కాస్త ఆప్యాయంగా గౌర‌విస్తు మాట్లాడితే చాలు. వారిని త‌మ ప్రాణ స్నేహితులుగా వీరు భావిస్తారు. వారి కోసం ఏ త్యాగం చేయ‌డానికైనా సిద్ధంగా ఉంటారు. వీరికి త‌మ మిత్రుల నుంచి ఎటువంటి సాయం అంద‌క‌పోయినా వీరు మాత్రం స్నేహితుల‌కు సాయం చేయ‌డానికి ఎల్ల‌ప్పుడు ముందుంటారు.

Ads

వృశ్చిక రాశి :

ఈ రాశి వారు న‌మ్మిన వారి ప‌ట్ల చాలా న‌మ్మ‌కంగా ఉంటారు. ఇత‌రుల‌ను అంత సుల‌భంగా అస‌లు న‌మ్మ‌రు. ఒక‌వేళ వీరు న‌మ్మిన‌ట్ట‌యితే వారి కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధంగా ఉంటారు. ఫ్రెండ్స్ కోసం ఎంతో ప్రాధాన్య‌త ఇస్తారు.

మ‌క‌ర రాశి :

మ‌క‌ర రాశి వారు ఫ్రెండ్‌షిప్‌ను ఒక బాధ్య‌త‌గా భావిస్తార‌ట‌. ఈ బాధ్య‌త‌ను వీరు ఎంతో న‌మ్మ‌కంగా నిస్వార్థంగా చేస్తారు. త‌మ స్నేహితుల‌ను మ‌క‌ర‌రాశి వారు త‌మ సొంత కుటుంబ స‌భ్యులుగా భావిస్తారు.

Also Read : 

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి అన్ని విధాలుగా లాభాలే