కేవలం సినిమా, క్రికెట్ తదితర రంగాలకు చెందిన వారు మాత్రమే అధికంగా ఆదాయాన్ని సంపాదిస్తారని చాలామంది అనుకుంటారు. నిజానికి అనేక రంగాలకు చెందిన వారు కూడా పెద్ద మొత్తంలో సంపాదిస్తుంటారు. కాకపోతే ఆ రంగంలో వారు నిపుణులు అయి ఉంటారు అంతేతేడా. ఇక అనేక ప్రధానమైన వృత్తుల్లో ఒకటైన లాయర్ వృత్తిలోనూ పలువురు అధిక మొత్తాన్ని సంపాదిస్తున్నారు. వారి వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
Advertisement
READ ALSO : ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్ : ప్రవేశ పరీక్షల షెడ్యూల్ 2023 విడుదల, ఎంసెట్ పరీక్ష ఎప్పుడంటే ?
# రామ్ జట్మలాని
ఈయన వయస్సు 93 ఏళ్లు. అయినప్పటికీ ఇప్పటికీ ఈయన లాయర్ గా కొనసాగుతున్నారు. ఈయన కోర్టులో ఒక్కసారి కనిపిస్తే రూ. 25 లక్షల ఫీజు తీసుకుంటారు. ప్రముఖ క్రిమినల్ లాయర్ గా అత్యంత అనుభవం, వయస్సు కలిగిన లాయర్ గా కూడా ఈయన పేరుగాంచారు.
# ఫాలి నారీమన్
న్యాయవ్యవస్థకు ఈయన అందించిన సేవలకు గాను ఈయన పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఒక కేసు వాదిస్తే ఈయన రూ. 8 లక్షల నుంచి 15 లక్షల వరకు ఫీజు తీసుకుంటారు.
# కేకే వేణుగోపాల్
దేశం లోని పేరుగాంచిన లాయర్లలో ఈయన ఒకరు. ఈయనను గతంలో భూటాన్ ప్రభుత్వం తమ రాజ్యాంగాన్ని రాసేందుకు నియమించుకుంది. ఈయన ఒక కేసుకు రూ.5 లక్షల నుంచి 70 లక్షల వరకు చార్జ్ చేస్తారు.
# గోపాల్ సుబ్రహ్మణ్యం
ఈయన సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులలో లాయర్ గా వాదిస్తారు. 2009 నుంచి 2011 వరకు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కూడా సేవలు అందించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన ఒక్క కేసుకు రూ.5.50 నుంచి 15 లక్షల వరకు తీసుకుంటారు.
Advertisement
# చిదంబరం
యూపీఏ హయాంలో చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈయన కార్పొరేట్ లాయర్ గా గుర్తింపు పొందారు. సుప్రీంకోర్టుతో పాటు ఇతర హైకోర్టులోను ఈయన లాయర్ గా వాదిస్తారు.
# హరీష్ సాల్వే
సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవిలో 9 ఏళ్లు కొనసాగారు. రిలయన్స్, ఐటిసి, టాటా, వోడాఫోన్ వంటి ప్రముఖ కంపెనీలు ఈయన క్లైంట్లుగా ఉన్నాయి. ఈయన ఒక్క కేసుకు రూ.6 లక్షల నుంచి 15 లక్షల వరకు తీసుకుంటారు.
# అభిషేక్ మను సింగ్వి
ఈయన 37 ఏళ్ల వయసులోనే అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసి పేరుగాంచారు. ఒక్క కేసు కు ఈయన రూ. 6 లక్షల నుంచి 11 లక్షల వరకు తీసుకుంటారు.
# సి ఆర్యమ సుందరం
ఈయన ప్రస్తుతం బీసీసీఐ లీగల్ అడ్వైజర్ గా ఉన్నాయి. అలాగే అనిల్ అంబాని వంటి ప్రముఖ వ్యక్తులకు లాయర్ గా సేవలందిస్తున్నారు. ఒక్క కేసుకు ఈయన రూ. 5.5 లక్షల నుంచి 16.50 లక్షల వరకు చార్జ్ చేస్తారు.
# సల్మాన్ కుర్షిద్
గతంలో ఈయన విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఒక్క కేసుకు రూ.5 లక్షల వరకు తీసుకుంటారు.
# కే టి ఎస్ తులసి
సుప్రీంకోర్టులో ఈయన ఫేమస్ సీనియర్ అడ్వకేట్ గా ఉన్నారు. రాబర్ట్ వాద్రా వంటి ప్రముఖ వ్యక్తుల కేసులను ఈయన వాదిస్తారు. 1994 నుంచి క్రిమినల్ జస్టిస్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నారు. ఒక్కో కేసుకు రూ.5 లక్షల ఫీజు తీసుకుంటారు.
Advertisement
READ ALSO : Ravanasura Movie : ‘రావణాసుర’ నుంచి మాస్ గ్లింప్స్ రిలీజ్.. ఫ్యాన్స్ కు పూనకాలే