జీవితం ఉరుకులు పరుగుల మయమైంది. పెరిగిపోతున్న సాంకేతికత, మారిపోతున్న దినచర్య వంటి కారణాలతో కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఎన్నో సమస్యలు, మరెన్నో ఆలోచనలతో ప్రశాంతంగా నిద్ర లేని పరిస్తితి తలెత్తుతోంది. చక్కటి ఆరోగ్యానికి నిద్ర ఎంతో అవసరం. ప్రతీ ఒక్కరికీ 6 నుంచి 8 గంటల వరకు రాత్రి నిద్ర అవసరం అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో బాగా నిద్ర పట్టేందుకు నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు.
ఇక వాటిని ఫాలో అయితే చక్కని నిద్రను సొంతం చేసుకోవచ్చు. అవి ఏమిటంటే చాలా మంది రాత్రి లేట్ గా నిద్రపోయి ఉదయం బారెడు పొద్దెక్కేంత వరకు మంచంపై నుంచి లేవరు. అలా చేయడం మంచి పద్దతి కాదు. సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. శరీరానికి కనీసం 20 నిమిషాలు ఎండ తగిలే విధంగా చూసుకోవాలి. బాడీకి కావాల్సినంత ఎండ తగిలితే చక్కగా నిద్ర పడుతుంది. అంతేకాదు.. సరైన మోతాదులో ఫైబర్ తీసుకుంటే నిద్ర పడుతుంది. గాఢంగా నిద్రపోయే అవకాశాన్ని పెంచుతుంది. విశ్రాంతి, అలసట తీరి నూతన ఉత్తేజం సొంతం అవుతుంది. ఓట్స్, పప్పులు, పండ్లు, కూరగాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
Advertisement
Advertisement
నిద్రపోయే ముందు ఓ పది నిమిషాలు చదివితే 68 శాతం ఒత్తిడి తగ్గుతుంది. 25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చక్కగా నిద్ర పడుతుంది. పడుకునే గది సాధారణ ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉండేవిధంగా చూసుకోవడం కీలకం. ఆహ్లాదకరమైన సంగీతం వింటే మనస్సు తేలిక అవుతుంది. ఇది మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. నిద్రకు ముందు 10 నిమిషాల పాటు మ్యూడిక్ వింట్ నిద్ర బాగా వస్తుంది. అంతేకాదు.. 5 నిమిషాలు దీర్ఘశ్వాస తీస్తూ నెమ్మదిగా వదులుతూ యోగా చేయాలి. ఇలా చేస్తే మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దీని ద్వారా గుండె కొట్టుకునే వేగం తగ్గి టెన్షన్ లేకుండా నిద్ర పడుతుంది.
Also Read :
Vidura Niti : జీవితంలో విజయం సాధించాలంటే ఈ మూడింటిని వదిలేయండి..!