ఇస్లామిక్ పవిత్ర మాసం అయినటువంటి రంజాన్ ఈ ఏడాది మార్చి 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 21న ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకుంటారు ముస్లిం సోదరులు. చంద్రుడి దర్శనంతో పవిత్రమైన రంజాన్ మాసానికి నాంది పలుకుతుంది. ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ పండుగను చాలా మంది ప్రజలు జరుపుకుంటారు. రంజాన్ ఉపవాస ఆచారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ముఖ్యంగా రంజాన్ మాసంలో ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం.. ఖురాన్ స్వర్గం నుంచి భూమికి వచ్చిందని ప్రజలు నమ్ముతారు. అందుకే రంజాన్ మాసంలో ఖురాన్ ని ఎక్కువగా చదువుతారు. ఉదయం సమయంలో ఉదయం 4.30 లోపు భోజనం చేయాలి. సాయంత్రం 6.59 గంటల వరకు ఇప్తార్ తో ఉపవాసాన్ని విరమిస్తారు. ఎక్కువ సమయం ఉపవాసం ఉండటం చాలా కష్టం. మండే ఎండలో రంజాన్ పండుగ వస్తుంది. కాబట్టి ఆహారంలో పుచ్చకాయ, కీర దోసకాయ టొమాటోలు, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఉపవాసం ఉన్న వారందరూ సూర్యాస్తమయం వరకు మంచినీరు తాగకుండా ఉండాలి. ఆకలి విలువ అందరికీ తెలియాలనేది దీని ఉద్దేశం.
Advertisement
Also Read : జనాలను పిచ్చోళ్లని చేసిన మంచు విష్ణు…అదంతా రియాలిటీ షో అంటూ వీడియో రిలీజ్..!
రంజాన్ పండుగకు కొత్త బట్టలు ధరించడం, నమాజ్ చేయడం, సూర్యాస్తమయం తరువాత కలిసి భోజనం చేయడం, పండుగ రోజుల్లో రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం కొన్ని జాగ్రత్తలను పాటించాలి. అనారోగ్యంతో బాధపడేవారు, ప్రయాణం చేసేవారు, వృద్ధులు, గర్బిణీలు, పీరియడ్స్ ఉన్నవారికి ఉపవాసం నుంచి మినహాయింపు ఉంది. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం. లేనియెడల ఎన్నో అనారోగ్య సమస్యలతో పోరాడాల్సి వస్తుంది.
Also Read : ఈ సీజన్ లో లభించే సపోటా పండ్లను తింటున్నారా ? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!