Home » తమిళ హీరోలతో సూపర్ హిట్ కొడుతున్న తెలుగు దర్శకులు వీరే..!

తమిళ హీరోలతో సూపర్ హిట్ కొడుతున్న తెలుగు దర్శకులు వీరే..!

by Anji
Ad

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతుంది. ఈ ట్రెండ్ లో లాంగ్వేజ్ బారియర్స్ చెరిగిపోయాయి. రీజనల్ సినిమాలలోనూ క్రాసోవర్ కాంబినేషన్స్ కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రధానంగా తెలుగు దర్శకులు, తమిళ హీరోలతో మెమరబుల్ హిట్స్ ఇస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో రీసెంట్ సెన్షేషన్ సార్. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పలు రికార్డులను తిరగరాస్తోంది. 

Also Read :  హీరో వల్ల బంపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ సినిమాలు !

Advertisement

తాజాగా ధనుష్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది సార్. ప్రస్తుతం మాస్ ట్రెండ్ లో ఉన్న ధనుష్ ను క్లాస్ మాస్టర్ గా చూపించి సూపర్ హిట్ సాధిస్తున్నారు దర్శకుడు వెంకీ అట్లూరి. తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి రూపొందించిన సార్ రెండు భాషల్లో ఘన విజయం సాధించింది. ఇక ఈ మధ్య వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో ఉన్న ధనుష్ కెరీర్ ని తిరిగి గాడిలో పెట్టింది సార్. ఈ చిత్రం సక్సెస్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న ధనుష్ విడుదల కాకముందే మరో టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన వారసుడు బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో చేరింది. ఏకంగా రూ.300 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ సరసన చేరింది.  

Advertisement

Also Read :  మా పని మనుషుల కాళ్ళు మొక్కుతా – రష్మిక

తెలుగు దర్శకులు అంతా సూపర్ ఫామ్ లో ఉండడంతో మరికొంత మంది తమిళ హీరోలు కూడా టాలీవుడ్ దర్శకులతో టచ్ లోకి వస్తున్నారు. ఇక ఈ ఫార్ములా అందరి విషయంలో కూడా వర్కవుట్ కావడం లేదు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ రూపొందించిన ప్రిన్స్ మాత్రం అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేదు. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో పర్వాలేదనిపించినా తమిళనాట పూర్తిగా ఫెయిల్ అయింది. ఓవరాల్ గా సక్సెస్ రేటే ఎక్కువగా ఉండడంతో తెలుగు దర్శకులకు కోలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. 

Also Read :  ఈ వేరు దొరికితే వదలకండి.. దీంతో కోటీశ్వరులు అవుతారు..!

Visitors Are Also Reading