ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదదయం తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలంగా చంద్రమోహన్ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు తరచూ కిడ్నీకి సంబంధించి డయాలసిస్ కూడా జరుగుతోంది. దీంతో ఆయన ఆరోగ్య రిత్యా కొన్నేళ్లుగా ఇంటికే పరిమితమం అయిపోయారు. 55 ఏళ్ల సినీ కెరీర్ లో 932 సినిమాల్లో నటించారు చంద్రమోహన్. ఇక ఈ మధ్య కాలంలో కాస్త సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. గోపిచంద్ హీరోగా నటించిన ఆక్సిజన్ మూవీనే ఆయనకు చివరి సినిమా.
Advertisement
చంద్రమోహన్ చివరి రోజల్లో ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపారు. ఇటీవలే కొన్ని ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆయన గుండె సంబంధిత వ్యాధితో ఆరోగ్యం విషమించడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. సోషల్ మీడియాలో కూడా పలువురు చంద్రమోహన్ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
Advertisement
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న చంద్రమోహన్ గారి అకాల మరణం చాలా బాధకరమని.. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ఎన్టీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అదేవిధంగా నారా లోకేష్ కూడా.. సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి చాలా బాధకరమని.. హీరో, కమెడియన్, సహాయ నటుడిగా విభిన్న పాత్రలు అలవోకగా పోషించిన ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేసారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!