Home » మెగా ఫ్యామిలీలో ఒక‌టి కంటే ఎక్కువ సార్లు పెళ్లి చేసుకున్న వారు వీళ్లే..!

మెగా ఫ్యామిలీలో ఒక‌టి కంటే ఎక్కువ సార్లు పెళ్లి చేసుకున్న వారు వీళ్లే..!

by Anji
Ad

జీవితంలో పెళ్లి అనేది చాలా కీల‌కం అనే చెప్పాలి. పూర్వ కాలం రోజుల్లో పెళ్లి అంటే నూరేళ్ల పంట అని.. అది ఓ పెద్ద పండుగ వాతావ‌ర‌ణం ఉండేది. ప్ర‌స్తుతం ఆ పెళ్లికి అర్థాన్నే మార్చేస్తున్నారు. ఇది వ‌ర‌కు పెళ్లి దాదాపు వారం రోజుల పాటు పండుగ మాదిరిగా కొన‌సాగితే ప్ర‌స్తుతం ఒక‌టి రెండు రోజుల్లోనే ముగించేస్తున్నారు. నేటి కాలంలో పెళ్లి అంటే నిండు నూరేళ్లు ఉండాల‌ని, ఏడు జ‌న్మ‌ల‌కు ఒకే భ‌ర్త దొర‌కాల‌ని క‌ల‌లు క‌నేవారు లేకుండా పోతున్నారు. ఒక జీవితంలో ఎన్ని పెళ్లిళ్లు జ‌రుగుతాయో చెప్ప‌లేని ప‌రిస్థితులున్నాయి. మెగా ఫ్యామిలీలో ఎంత మంది రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. వారి గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ :

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు చెప్ప‌గానే ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించే మాట్లాడుతుంటారు. ఆయ‌న‌ని వ్య‌క్తిగ‌తంగా రాజ‌కీయంగా దెబ్బ‌తీయ‌డానికి ఆయ‌న శ‌త్రువులు రాజ‌కీయ ప్ర‌త్యర్థులు వాడుకుంటూ ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌టి భార్య నందిని, రెండవ భార్య రేణుదేశాయ్ వీరిద్ద‌రికీ విడాకులు ఇచ్చి ఇప్పుడు అన్నా లెజ్‌నేవాని మూడో పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే.

విజ‌య‌దుర్గ :

Advertisement

చిరంజీవి చెల్లెలు, సాయి ధ‌రంతేజ్ త‌ల్లి అయిన‌టువంటి విజ‌య దుర్గ కూడా పెళ్లి క‌లిసి రాలేద‌నే చెప్పాలి. సాయిధ‌రంతేజ్ వైష్ణ‌వ్ తేజ్ పుట్టిన త‌రువాత ఆమె భ‌ర్త‌తో విడాకులు తీసుకొని విడిగా ఉంది. వీరిద్ద‌రూ పెరిగి పెద్ద అయిన త‌రువాత ఆమె మ‌ళ్లీ పెళ్లి చేసుకుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  జ‌య‌ప్ర‌ద మామ తెలుగు సినిమా లెజెండ్ అనే విష‌యం మీకు తెలుసా..?

శ్రీ‌జ :

చిరంజీవి రెండో కుమార్తె శ్రీ‌జ పెళ్లి విష‌యంలో ఇప్ప‌టికే రెండు సార్లు త‌ప్పుట‌డుగు వేసిన‌ట్టు క‌నిపిస్తోంది. తొలుత ఇంట్లో నుంచి వెళ్లి పోయి పెళ్లి చేసుకున్న శ్రీ‌జ ఒక కుమార్తె పుట్టిన త‌రువాత అత‌ని వ‌ద్ద నుంచి విడిపోయి మ‌రో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మ‌రో పాప పుట్టిన త‌రువాత మ‌ళ్లీ విడిగానే ఉంటుంది. ఇద్ద‌రూ పిల్ల‌ల త‌ల్లి అయిన త‌రువాత ఆమె రెండ‌వ సారి విడాకుల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి  :  బాల‌య్య స‌ర‌స‌న క‌నిపిస్తున్న ఈ ఇద్ద‌రూ చిన్నారులు ఇప్పుడు కూడా టాలీవుడ్ స్టార్స్ అనే విష‌యం మీకు తెలుసా..?

అల్లు బాబీ :

అల్లు కుటుంబాన్ని మెగా ఫ్యామిలీ నుంచి దూరంగా చూడ‌లేం. అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడైన అల్లు బాబీ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. తొలుత ఒక కూతురు పుట్టిన త‌రువాత మొద‌టి భార్య నుంచి విడిపోయి ఇప్పుడు మ‌రో పెళ్లి చేసుకున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  జీవితం మొత్తం న‌టిస్తూనే ఉన్న ఈ స్టార్ న‌టుల గురించి మీకు తెలుసా..?

Visitors Are Also Reading