తెలంగాణలో పోటీ పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీలతో ఇప్పటికే పలు పరీక్షలను రద్దు చేసింది TSPSC. మరికొన్ని పరీక్షలను ముందుగానే రద్దు చేసింది. తాజాగా మరికొన్ని పరీక్షలను రీ షెడ్యూల్ చేసింది కమిషన్. 5 నియామక పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించారు. అగ్రికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్, డ్రగ్స్ ఇన్ స్పెక్టర్, వాటర్ డిపార్ట్ మెంట్ లోని గెజిటెడ్ అండ్ నాన్ గెజిటేడ్ పోస్టులు వంటి మొత్తం 5 పోటీ పరీక్షల తేదీలను ఓ కమిషన్ ప్రకటనలో వెల్లడించింది.
Also Read : IPL 2023 : ‘చెంప చెల్లుమంటుంది’.. గిల్ కు సెహ్వాగ్ వార్నింగ్
Advertisement
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు తొలుత ఏప్రిల్ 23న పరీక్ష తేదీని ప్రకటించగా.. తాజాగా జూన్ 26 కి పరీక్షను వాయిదా వేశారు. పాత షెడ్యూల్ ప్రకారం.. ఏవీఎంఐ ఎగ్జామ్ తేదీ ఏప్రిల్ 23న ప్రకటించారు. తాజాగా ఈ పరీక్షను జూన్ 26కి వాయిదా వేశారు. పేపర్ లీకేజీ కలకలం ఇంకా ఏమైనా ఎగ్జామ్ పేపర్లు లీక్ అయ్యాయా అనే అనుమానంతో పరీక్షలను రీ షెడ్యూల్ చేస్తోంది కమిషన్. కొత్తగా పేపర్లను తయారు చేసి రీ షెడ్యూల్ చేసిన తేదీల్లో ఈ 5 నోటిఫికేషన్లకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
Advertisement
Also Read : ఆ సినిమాకే నయనతారతో లవ్ లో పడ్డా – విగ్నేష్ శివన్
అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 25న ఉండాల్సిన పరీక్షను మే 16కి రీషెడ్యూల్ చేశారు. మే 19న డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ ఎగ్జామ్ నిర్వహించనుండగా వాటర్ బోర్డులో ఉద్యోగాలకు నిర్వహించే పరీక్ష తేదీలను సైతం కమిషన్ ప్రకటించింది. మే 15, 16 తేదీలలో నిర్వహించాల్సిన వాటర్ బోర్డులో నాన్ గెజిటేడ్ ఉద్యోగాలను జులై 20, 21న తేదీలకు రీ షెడ్యూల్ చేశారు. ఇందులోనే గెజిటేడ్ జులై 18, 19 తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.