సాధారణంగా కాబోయే జీవిత భాగస్వాముల మధ్య ఎలాంటి దాపరికాలు అస్సలు ఉండకూడదు. ఎంతో పారదర్శకంగా ఉండటం ద్వారా వారు తమ బంధాన్ని చిరకాలం కొనసాగించుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తనకు ఇష్టమైన వాడైనా, కాబోయే జీవిత భాగస్వామి అయినా మహిళా తప్పకుండా అడగాల్సిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి నిపుణులు తెలియజేస్తున్నారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
మీ భవిష్యత్ లక్ష్యాలు ఏమిటి..?
అబ్బాయిల యొక్క జీవిత లక్ష్యాల గురించి అడిగేందుకు చాలా మంది యువతులు వెనుకాడుతారు. అలా అడిగితే ఒత్తిడికి గురవుతున్నారని.. కోపం తెచ్చుకుంారని సందేహిస్తుంటారు. తమ అనుబంధంపై ప్రభావం పడుతుందేమోనన్న భయం కూడా మిమ్మల్ని వేధిస్తుంది. వాస్తవానికి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే వారి కంటే పారిపోయే అబ్బాయిలే ఎక్కువ అని చెప్పవచ్చు. అబ్బాయి జీవిత లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏంటో మందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మీరునా నుంచి ఏమి కోరుకుంటున్నారు.?
భావోద్వేగంగా, వాస్తవికంగా నా నుంచి ఏం కోరుకుంటున్నారు అని అడగడం కూడా చాలా అవసరం. దీంతో ఒకరి మనసు కోరుకుంటున్నవి మరొకరికీ ముందే తెలుస్తాయి. ఇద్దరూ ఒకరికీ ఒకరూ తోడుగా ఉండటానికి ఇవి బలంగా నిలుస్తాయి.
రిలేషన్ షిప్ గురించి మీ అభిప్రాయం ఏంటి ?
Advertisement
మన రిలేషన్ లేదా అనుబంధం వల్ల వివాదం ఏర్పడుతుందా ? లేక మనస్పార్థాలు వస్తాయా అని సంకోచించచ్చు. ఎందుకు అంటే ఇద్దరి మధ్య దాపరికాలు లేని పారదర్శకతమైన ఆలోచనలే బంధానికి బలమైన పునాదులు అవుతాయి. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన అనుబంధానికి ముఖ్యంగా స్పష్టత చాలా అవసరం.
ఇంటి పనుల్లో మీ పాత్ర ఏంటి ?
ఇంటి పనుల్లో మీ పాత్ర ఎంత మేరకు ఉంటుందనే మహిళ ప్రశ్నించడం తప్పు కాదు.. ఎందుకు అంటే బాధ్యతలు అన్నీ కూడా ఒకరి నెత్తిపైనే వేయడం కంటే ఇద్దరూ సమానంగా పంచుకున్నప్పుడే సౌకర్యంగా ఉంటుంది.
కష్టాలను ఎలా జయిస్తావు ?
కష్టాలు పలకరించినప్పుడు, సవాళ్లు ఎదురు అయినప్పడు సవాళ్లు ఎదురైనప్పుడు క్లిష్టపరిస్థితులను ఎలా ఎదుర్కుంటావు అని ముందే అడగడం కొంచెందికష్టమైన ప్రశ్నే అని చెప్పాలి. కాకపోతే ఇలా అడగడం వల్ల కష్టసమయాలను ఎలా గట్టెక్కవచ్చన్న దానిపై ఒకరి వ్యూహాల గురించి స్పష్టత ఏర్పడుతుంది. ఒకరికొకరూ తోడుగా నిలిచేందుకు దారి చూపిస్తుంది.
డబ్బు గురించి మీ అభిప్రాయం ఏంటి ?
ముఖ్యంగా దంపతుల మధ్య డబ్బు విషయాలు చాలా సున్నితమైనవి. డబ్బు ప్రస్తావన తీసుకొస్తే.. గొడవలు ఏర్పడుతాయన్న భయం ఉండవచ్చు. కానీ కలిసి నడిచే వారి మధ్య ఆర్థికపరమైన విషయాల్లో తప్పకుండా భాగస్వామ్యం ఉండాలి. పారదర్శకత ఉండాలి. దంపతులు ఇద్దరూ కలిసి ప్రణాళిక రూపొందించుకోవడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.