సాధారణంగా ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ అయిందంటే.. అప్పటికీ ఉన్న పెద్ద సినిమా కలెక్షన్లన్నింటీని దాటేసి సరికొత్త రికార్డు సృష్టించాలి. అలాంటి సినిమాలు సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, ఇంద్ర, పోకిరీ వంటి సినిమాలు ఆ కోవకే చెందుతాయి. ముఖ్యంగా మాస్ అంటే ఫ్యాక్షన్ అనుకునే సమయంలో సరిగ్గా యాక్షన్ మూవీ పడితే ఎలా ఉంటుందో చూపించిన సినిమా పోకిరి అని చెప్పవచ్చు. 1999 నుంచి 2006 వరకు చాలా సినిమాలు వచ్చినప్పటికీ పోకిరి లాంటి హిట్ సినిమా మాత్రం రాలేదు.
Advertisement
పోకిరి సినిమా హిట్ కావడానికి ప్రధాన కారణం పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. ముఖ్యంగా పూరి జగన్నాథ్ ఆంధ్రావాలా సినిమాతోనే మాఫియాను, గ్యాంగ్ స్టార్ ని దింపుదామని చూశాడు.కానీ ఆంధ్రావాలా మూవీ దారుణంగా బోల్తా కొట్టింది. పోకిరి అంతా కనెక్ట్ అవుతుందని పూరి, మహేష్ కూడా ఊహించి ఉండరు. ఆ రేంజ్ లో సక్సెస్ అందుకుంది పోకిరి. ఆ రేంజ్ లో సూపర్ హిట్ సాధించడానికి కూడా పోకిరికి కొన్ని విషయాల్లో అదృష్టం కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. అందులో మొదటిది పోకిరి విడుదల సమయంలో ఇతర సినిమాలు ఏమి లేవు. ప్రభాస్ పౌర్ణమి, బాలయ్య వీరభద్ర, పవన్ కళ్యాణ్ బంగారం వంటి సినిమాలన్ని నిరాశ పరిచాయి. పోకిరి వచ్చిన రెండు నెలల వరకు కూడా ఒక్క హిట్ సినిమా లేదు. రెండు నెలల తరువాత రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమా మాత్రమే హిట్ అయింది. ఈ రెండు నెలల వ్యవధిలోనే పోకిరి సోలోగా థియేటర్స్ ని కాపాడింది. ఇండస్ట్రీని ఏలిందనే చెప్పాలి. ఒక రకంగా రిపీట్ ఆడియన్స్ రావడానికి వేరే ఇతర సినిమాలు లేకపోవడం కూడా కారణమే.
Advertisement
ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ అయిందంటే దానికి ధీటుగా ఏమాత్రం ప్రేక్షకులను అలరించలేని సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ హిట్ రికార్డు సాధించేవి అప్పట్లో. పోకిరి సినిమా ఎండాకాలంలో విడుదలవ్వడంతో పవర్ కట్ నుంచి సేద తీరడానికి సినిమాను ఎంచుకొని ఎంతో మంది ప్రేక్షకులకు పోకిరి దిక్కు అయింది. పోకిరి సినిమా సినిమాటోగ్రఫి పోకిరి విజువల్ గా చూడడానికి సూపర్ గా ఉంటుంది. ఫైట్స్ సీన్లు చాలా బాగుంటాయి. దీనికి తోడు మహేష్ నటన ఆకట్టుకుందనే చెప్పాలి. అదేవిధంగా మణిశర్మ సంగీతం కూడా ఈ సినిమాకు చాలా ప్లస్ అనే చెప్పాలి. మహేష్ కారు దిగి వస్తున్న సమయంలో మ్యూజిక్ మామూలుగా ఉండదు. ఆ మ్యూజిక్ కారణంగా పోకిరి హిట్ అయిందనీ ఇప్పటికీ చెబుతుంటారు చాలా మంది. దేవదాస్ సినిమాతో యూత్ ని తనవైపు తిప్పుకున్న ఇలియానాకు రెండో సినిమా పోకిరి. మహేష్ పక్కన పర్ ఫెక్ట్ గా సెట్ అయ్యారు. మహేష్, ఇలియానా మధ్య వచ్చే సీన్లు ఆడియన్స్ కి కూడా నచ్చేవిధంగా ఉంటాయి. ఈ సినిమాలో ఇప్పటికింకా నా వయస్సు, డోలే డోలే పాటల కోసమే కొంత మంది సినిమా చూసేవారు. ఒకటి బాస్కెట్ బాల్ కోర్టు సీన్ మహేష్ కి తప్ప వేరే ఎవ్వరికీ షూట్ కాదన్నట్టుగా ఉంటుంది. లోకల్ ట్రైన్ ఫైట్స్ ఆడియన్స్ ని కట్టిపడేస్తాయి. డైలాగ్ లు కూడా చాలా అద్భుతమే. ఇలా అన్ని కలిసి రావడంతోనే మహేష్ బాబుకి పోకిరి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పునీత్ రాజ్ కుమార్ కోసం పవన్ కళ్యాణ్ ఇంత త్యాగం చేశారా.. ఎవరికి తెలియని నిజం..!!
SSMB 28 కోసం మూడు టైటిల్స్.. అమరావతికి ఓకే చెబుతారా!