Telugu News » Blog » ప్రేమ,పెళ్లితో మోసపోయి ఆధ్యాత్మికత కొనసాగిస్తున్న హీరోయిన్స్ వీరే..!

ప్రేమ,పెళ్లితో మోసపోయి ఆధ్యాత్మికత కొనసాగిస్తున్న హీరోయిన్స్ వీరే..!

by Anji
Ads

సాధారణంగా సినిమా వాళ్లంటే అభిమానులకు చాలా క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ కోసమే చాలా మంది నటులు అవ్వాలని ఎంత ఆశపడుతుంటారు. తమను అభిమానించే వారి కోసం ఓ వైపు సినిమాల్లో నటిస్తూ.. మరోవైపు డబ్బు సంపాదించవచ్చు అనుకుంటారు. దాదాపు హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ ఇదే చేస్తారు. మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న టాలీవుడ్ లో ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే పలు భాషల్లో మంచి పేరు ఉన్న హీరోయిన్స్ అయినప్పటికీ సినిమాలు డబ్బు క్రేజ్ అన్ని వదులకొని సన్యాసుల్లా జీవిస్తున్నారు. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసి తమలోని స్పిరిచువల్ భావాలను ప్రపంచానికి చాటి చెబుతున్నారు. వద్దంటే వచ్చి పడే డబ్బును కాదనుకొని జీవితాన్ని ఆధ్యాత్మికత వైపు నడిపించుకుంటున్న హీరోయిన్స్ ఎవరెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

Also Read :   ఓటీటీలో వినరో భాగ్యము విష్ణు కథ స్ట్రీమింగ్ ఎప్పుడు ? ఎక్కడ అంటే..? 

Manam News

ఫస్ట్  గీతాంజలి సినిమాతో నాగార్జున సరసన హీరోయిన్ గా పరిచయమైన గిరిజ.. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా చెరగని ముద్ర చేసిన ఈ టాలెంటేడ్ బ్యూటీ.. తరువాత హృదయాంజలి అనే సినిమా చేసి ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. అది కూడా సినిమాలంటే పెద్దగా ఇష్టం లేకపోవడమే గమనార్హం. ఇదిలా ఉంటే.. బ్రిటన్ లో పుట్టి పెరిగిన గిరిజ చదువు అయిపోయాక భరతనాట్యం నేర్చుకోవడానికి ఇండియా వచ్చి అనుకోకుండా హీరోయిన్ అయింది. ఆ తరువాత కొద్ది రోజులకే మనస్సు మార్చుకొని సినిమాల నుంచి తప్పుకొని ఆధ్యాత్మికత వైపు మాలి పాండిచ్చేరిలోని శ్రీ అరబిందో ఆశ్రమంలో చేరింది. సినిమాలు ముఖ్యమా ఆధ్యాత్మికత ముఖ్యమా అనే మీ మాంసలో ఉన్నప్పుడు ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి ఆశ్రమంలో చేరింది.  

Also Read :  సమంత చైతు విడాకులకు కారణం సమంతనేనట..!!

Manam News

ఇలాగే మరో హీరోయిన్ పూర్తి పేరు హీరా రాజగోపాల్. చెన్నైకి  చెందిన హీరా తెలుగులో ఆహ్వానం, అల్లుడు గారొచ్చారు. లిటిల్ సోల్జర్స్ వంటి సినిమాల ద్వారా పరిచయమే. తమిళ, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలలో కలిపి 50కి పైగా  నటించిన హీరా  తమిళ  స్టార్ హీరో అజిత్  ప్రేమలో పడింది. వీరిద్దరి మధ్య ఏమైందో ఏమో కానీ ఇండస్ట్రీని వదిలేసి పెళ్లి చేసుకున్నారు. అదికూడా నాలుగేళ్లు కూడా సజావుగా సాగకపోవడంతో.. జీవితంపై విరక్తితో ఆధ్యాత్మికతను జీవనమార్గంగా ఎంచుకున్నారు. మరోపెళ్లి ఆలోచన కూడా చేయకుండా తన జీవితాన్ని పూర్తి ఆధ్యాత్మికంగానే గడపడానికి నిశ్చయించుకున్నారు. 

Advertisement

Also Read :  ఓటీటీలోకి పంచతంత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Manam News

ఇక నటి రమాప్రభ.. టాలీవుడ్ లెజెండ్ కమెడియన్ రమా ప్రభ జీవితం అందరికీ తెరిచినా పుస్తకమే. జీవితంలో ఎంతో ఎత్తుకు వెళ్లిన ఈమె.. పెళ్లి కారణంగా అన్ని పోగొట్టుకొని విడాకులు తీసుకొని అన్ని వదిలేసి టాలీవుడ్ పెద్దల డొనేషన్స్ తో రమాప్రభ ప్రస్తుతం చివరి రోజులు వెళ్లదీస్తున్నారు. తెల్లవారింది మొదలు నిద్రపోయే వరకు ఆమెకు ఆధ్యాత్మిక చింతన తప్ప మరో ఆలోచన ఉండదు.  

Also Read :  సమంతను నాగచైతన్య అంతలా టార్చర్ చేశారా ? ఆ ట్వీట్ వైరల్..!

Manam News

మరొక హీరోయిన్ కృతికర్బందా కి సైతం ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువనే. బాలీవుడ్ లో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న కృతి ఇటీవల ఓ సినిమా కోసం లండన్ షూటింగ్ కి వెళ్లింది. మధ్యలో ఈ సినిమాకి బ్రేక్ రావడంతో అందరూ లండన్ చుట్టు పక్కల ప్రాంతాలను చూడడానికి వెళ్లిపోతే ఆమె మాత్రం లండన్ లోని ఓ గురు ద్వారాని శుభ్రపరుస్తూ.. తన ఆధ్యాత్మికతను చాటుకుంది. ఏ మాత్రం కాళీ సమయం దొరికినా దైవ సేవ చేయడం ఆమెకు అలవాటు. వీరే కాకుండా.. ఇంతకు ముందు కొంత మంది హీరోయిన్స్ ఏకంగా సన్యాసం పుచ్చుకున్నారు. మనీషా కొయిరాలా, సుచిత్ర సేన్, బిగ్ బాస్ సోఫియా హయత్, మమతా కులకర్ణి, బర్ఖ మదన్ వంటి హీరోయిన్స్ పూర్తిగా సన్యాసంనే తీసుకున్నారు. 

Advertisement

Also Read :  RRR ఆస్కార్ కొనేసిందని బాలీవుడ్ సెలెబ్రిటీ ట్వీట్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?