Telugu News » Blog » 2021లో భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు ఇవే..!

2021లో భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు ఇవే..!

by AJAY
Ads

2021లో ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని సినిమాలు మంచి విజయం సాధించగా మరికొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలిచి ప్రేక్షకులను నిరాశ పరిచాయి. అలా బాక్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…

Advertisement

నితిన్ హీరోగా నటించిన చెక్ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

Chavu kaburu challaga

Chavu kaburu challaga

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై కార్తికేయ హీరోగా నటించిన చావుకబురు చల్లగా సినిమా ఈ ఏడాది విడుదల అయింది. ఈ సినిమాలో లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

Aranya

Aranya

భారీ గ్రాఫిక్స్ తో పాన్ ఇండియా స్టార్ట్ రానా నటించిన సినిమా అరణ్య. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులలో అంచనాలను పెంచాయి. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

Srikaram

Srikaram

వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా శ్రీకారం. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి లాంటి హీరోలు ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

Mosagallu

Mosagallu

ప్రస్తుత మా అధ్యక్షుడు మంచు విష్ణు హీరోగా నటించిన సినిమా మోసగాళ్ళు. ఈ సినిమాలో కాజల్ మంచు విష్ణుకు సోదరిగా నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయింది.

Advertisement

Pagal

Pagal

విశ్వక్ సేన్ హీరోగా నటించిన యూత్ ఫుల్ లవ్ డ్రామా పాగల్. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకోగా సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.

Sridevi soda center

Sridevi soda center

సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్ గా నటించింది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

Kondapolam

Kondapolam

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా కొండపొలం. ఉప్పెన సినిమా భారీ విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

Mahasamudram

శర్వానంద్, సిద్ధార్థ హీరోలుగా నటించిన సినిమా మహాసముద్రం. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా టీజర్ మరియు ట్రైలర్ లు ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

Advertisement

Also Read: ఛ‌త్ర‌ప‌తి సినిమాకు ప్ర‌భాస్ కు డ‌బ్బింగ్ చెప్పిన స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా..?