చాలా మంది వర్షాకాలం వచ్చిందంటే చాలు గరం గరం మిర్చి, సమోస తినాలనిపిస్తుంటుంది. కానీ ఆయిల్ ఫుడ్ తిని అనారోగ్యం పాలుకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి పెంచే ప్రత్యేక పండ్లు తినాలి. సీజనల్ వ్యాధులను దూరంగా ఉండచానికి మనకు అందుబాటులో ఉండే ఈ పండ్లు దోహదపడుతాయి. ఏయే పండ్లు తింటే ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
నేరేడుపండ్లు :
వర్షాకాలంలో ఎక్కువగా దొరికేవి నేరేడుపండ్లు. నేరేడు పండ్లను రాజు అని కూడా పిలుస్తుంటారు. అందులో కెలోరీలు తక్కువగా ఉంటాయి. ఇనుము, ఫోలేట్, పొటాషియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు నేరేడును తీసుకోవాలి. అజీర్తి సమస్యను తగ్గిస్తాయి.
బొప్పాయి పండు :
విటమిన్ ‘సి’ అధికంగా లభించే బొప్పాయి పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిని తినడం ద్వారా వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. పీచు ఎక్కువగా ఉంటుంది. అయితే బొప్పాయిని మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది.
దానిమ్మ :
Advertisement
రోగ నిరోధక శక్తి పెంచడంలో దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా రక్తకణాలు వృద్ధి చెందడం కోసం దానిమ్మను కచ్చితంగా తీసుకోవాలి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోజు ఓ పండు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు యవ్వనంగా కనిపిస్తారు.
యాపిల్ :
వానా కాలంలో జీవక్రియల రేటు కాస్త నిదానం ఉంటుంది. దీంతో శరీరం కూడా అంత చురుకుగా ఉండదు. కాబట్టి యాపిల్ తింటే ఆరోగ్యంగ, చురుకుగా ఉంటారు. అదేవిధంగా ప్రతి రోజూ యాపిల్ పండు తినడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. యాపిల్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుగా పని చేస్తుంది.
అరటి :
అరటిపండులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థను శుభ్రం చేసే శక్తి అరటిపండుకు మాత్రమే ఉంది. అజీర్తి సమస్య ఉండదు. పిల్లలకు రోజు ఒక అరటిపండు తినిపించాలి. అందులో ఉండే ప్రోటిన్లు చిన్న పిల్లలకు ఎంతో అవసరం. అరటి పండు తినడం ద్వారా శరీరానికి శక్తి అందించడంతో పాటు పొట్ట నిండిన భావన కూడా కలుగుతుంది.
Also Read :
మీ లైఫ్ స్టైల్ మారిపోవాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు..!
ప్రధాని కోసం గరిట తిప్పుతానంటున్న యాదమ్మ..?