Home » పెళ్లికి ముందే గర్భం దాల్చిన సెలబ్రిటీలు వీరే..!

పెళ్లికి ముందే గర్భం దాల్చిన సెలబ్రిటీలు వీరే..!

by Anji
Ad

సాధారణంగా పెళ్లి అనేది మనిషి జీవితంలో ఒక గొప్ప వరం. పెళ్లి చేసుకున్న తరువాత కూడా సంతానం కలగడం కూడా అదృష్టం గా భావిస్తారు. కొంత మందికి పెళ్లి జరిగి ఏళ్లు గడిచినా కానీ సంతానం కలుగరు. కొంత మందికి పెళ్లి జరిగిన నెల రోజుల్లోనే గర్భవతి అవుతుంటారు. మరికొందరూ అయితే ఏకంగా పెళ్లి కాకముందే గర్భం దాల్చిన వారు కూడా ఉంటారు. వారిలో కొంత మంది సెలబ్రిటిల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

తెలంగాణకు చెందిన నటుడు రాహుల్ రామకృష్ణ తెలుగు తెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. త్వరలో తండ్రి కాబోతున్నట్టు స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు రాహుల్ రామకృష్ణ. తన భార్య గర్భవతిగా ఉన్న ఫోటో ఒకటి షేర్ చేస్తూ మీట్ అవర్ లిటిల్ ఫ్రెండ్ అని ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు షాకయ్యారు. 

అలియా భట్ నవంబర్ 06, 2022న కుమార్తెకు జన్మనిచ్చింది. వాస్తవానికి ఈమె పెళ్లి ఇదే ఏడాది ఏప్రిల్ 14న జరిగింది. రెండు నెలల తరువాత అనగా జూన్ 7న అలియా తాను గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. 

Also Read :  కళ్యాణ్ రామ్ చిత్రానికి టైటిల్ ఖరారు.. మూడు పాత్రల్లో..!

Manam News

నీనా గుప్త ఈమె ప్రసిద్ధ బాలీవుడ్ నటి. ఇప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీలో చాలా చురుకుగానే ఉంటుంది.  ఈమెకి మసాబా గుప్త అనే కుమార్తె జన్మించింది. నీనా గుప్తాకు, వెస్టిండిస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ లకు మసాబా జన్మించింది. నీనా తన కుమార్తెను తండ్రి లేని లోటును తెలియకుండా ఒంటరిగా పెంచి పెళ్లి చేసింది. 

Advertisement

Sarika

 

కమల్ హాసన్ రెండో భార్య సారిక. కమల్ తన తొలి భార్యకు విడాకులు ఇవ్వకముందే సారికతో సహజీవనం చేశాడు. దీంతో సారిక పెళ్లికి ముందే గర్భవతి అయిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. కమల్, సారికలు సహజీవనం చేస్తున్న సమయంలోనే మొదటి కూతురు శృతిహాసన్ జన్మించింది.  

Also Read :  టాలీవుడ్ హీరోల భార్యలు హీరోయిన్ ల కంటే ఎక్కువ సంపాదిస్తారనే విషయం మీకు తెలుసా ?

manam News

 నటాషా స్టాంకోవిచ్ భారత ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యాను పెళ్లి చేసుకుంది. నటాషా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. పెళ్లికి ముందే నటాషా గర్భం దాల్చినట్టు నటాషా, హార్దిక్ పాండ్యా ఇద్దరూ కలిసి ప్రకటన చేశారు.  

Also Read :  సావిత్రి అలాంటి స్థితిలో ఉన్నా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎందుకు సాయం చేయ‌లేదు..? ఆ ఒక్క త‌ప్పే వారిని ఆపిందా..?

నేహా ధూపియా, అంగద్ బేడీలు అకస్మికంగా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. 2018 మే నెలలో వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న నెల రోజుల తరువాత తాను గర్భం దాల్చినట్టు సోషల్ మీడియా వేదికగా నేహా ధూపియా ప్రకటించింది.  ఇలా చెప్పుకుంటూ పోతే సెలబ్రిటీలు పెళ్లికి గర్భం దాల్చిన వారు చాలా మందే ఉంటారు.  

Also Read :  సమంతతో విడాకులు రద్దు చేసుకున్న నాగచైతన్య..? వాస్తవమేనా ?

Visitors Are Also Reading