Home » వర్షాకాలంలో దానిమ్మ రసం తాగడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

వర్షాకాలంలో దానిమ్మ రసం తాగడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలామందికి అంటు వ్యాధులు,జ్వరాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువగా నీరు నిల్వ ఉండడం వల్ల వాటిపై దోమలు పెరిగి అది మానవుని పై దాడి చేయడం వల్ల ఈ రోగాలు ప్రబలుతున్నాయి. కాబట్టి వర్షాకాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక నియమాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బయట తినుబండారాలు అసలు ముట్టుకోవద్దని తెలియజేస్తున్నారు. వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి పానీయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ముఖ్యంగా పండ్ల జ్యూస్ లలో దానిమ్మ జ్యూస్ చాలా మేలు.

Advertisement

వర్షాకాలంలో దానిమ్మరసం తాగడం వల్ల కలిగే లాభాలేంటో మనం ఇప్పుడు చూద్దాం.. వర్షాకాలం సీజన్ లో ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఎందుకంటే దానిమ్మలో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి.చాలామంది వర్షాకాలంలో వేడివేడి వేయించిన ఫుడ్డు తినడానికే ఆసక్తి చూపిస్తారు. కానీ ఇలాంటి ఫుడ్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ కాస్త బలహీనంగా తయారవుతుంది. కాబట్టి ప్రతి రోజూ ఒక గ్లాసు దానిమ్మరసం తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

Advertisement

 

ఎందుకంటే దానిమ్మలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. దానిమ్మలో విటమిన్ సి ఉండటంవల్ల రోగ నిరోధకశక్తి బలపడుతుంది. వైరస్ లు,బ్యాక్టీరియాల బారిన పడకుండా రక్షిస్తుంది. ఇది చర్మానికి చాలా ప్రయోజనకరం. చర్మంపై ముడతలు లాంటి సమస్యలు తొలగిపోయి శరీరం నిగనిగలాడుతుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంవల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే రక్తహీనత కూడా అదుపులో ఉంటుంది. అంతే కాకుండా శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.

also read:

Visitors Are Also Reading