Home » భార్య తన భర్తలో కోరుకునే 5 లక్షణాలు ఇవే.. వీటిని తప్పక తెలుసుకోండి..!

భార్య తన భర్తలో కోరుకునే 5 లక్షణాలు ఇవే.. వీటిని తప్పక తెలుసుకోండి..!

by Anji
Ad

సాధారణంగా  పెళ్లి అనేది జన్మ జన్మల బంధం అంటుంటారు. పెళ్లిళ్లు స్వర్గంలోనే జరుగుతాయని భావిస్తారు. పెళ్లి సంబురం ఏడాది వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ తరువాత మొదలవుతాయి అసలు కష్టాలు. వాటన్నింటినీ దాటుకొని వెళ్తేనే బంధం బలపడుతుంది. సంసార నావ సాఫీగా సాగాలంటే ఒకరి ఆలోచనలతో మరొకరికీ ఇబ్బంది కలుగకుండా ఉండాలి. ఒకరి ఆలోచనలకు తగినట్టు మరొకరు ఉండాలి. చాలా మంది భార్యలు తమ భర్తల్లో ఈ 5 లక్షణాలు ఉండాలని తప్పక కోరుకుంటారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Advertisement

  • భర్తలో భార్య కోరుకునే మొదటి లక్షణం తనను అర్థం చేసుకోవాలనుకుంటుంది. ఎక్కువగా అహంకారం చూపించకుండా.. అర్థం చేసుకునే తత్వం ఉంటే బాగుంటుందని భార్యలు భావిస్తారు.
  • సర్ ప్రైజ్ అంటే చాలా మంది భార్యలు ఇష్టపడుతుంటారు. తమ భర్తలు తమను సర్ ప్రైజ్ చేయాలని భార్యలు కోరుకుంటారు. వారికి నచ్చినది ఏదో తెలుసుకొని అడగకుండానే తమ భర్తలు తీసుకురావాలని కోరుకుంటారు.
  • చాలా మంది భార్యలు తమ భర్తలు నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. ఏదైనా తప్పు చేసిన దానిని తమ ముందు ఒప్పుకోవాలని కోరుకుంటారు. ఆ విషయం వల్ల తొలుత బాధపడినా ఆ తరువాత అర్థం చేసుకొని నిజాయితీని అంగీకరిస్తుంది. అబద్దాలు చెప్పడం కంటే.. నిజాయితిగా నిజం చెప్పే వారిని భార్యలు బాగా ఇష్టపడుతారు.
  • ప్రతీ మనిషికీ కష్టాలుంటాయి. భార్యలు తమ కష్టాలను తాము చెప్పక ముందే భర్తలు తెలుసుకోవాలని ఆశిస్తారు. తెలుసుకున్న తరువాత కూడా వాటిని మరిచిపోకుండా ఉండాలని భావిస్తారు.
  • ఏ ఇద్దరికీ ఒకే రకమైన అభిప్రాయాలుండవు. కలిసి ఉన్నా భిన్నాభిప్రాయాలుంటాయి. ఇలా ఉన్నప్పుడు తన అభిప్రాయానికే భర్త విలువ ఇవ్వాలని భార్యలు కోరుకుంటారు. భర్త అభిప్రాయాన్ని తమపై రుద్దకుండా ఉండాలని భార్యలు ఆశిస్తారు. నచ్చకపోతే నచ్చలేదనే చెప్పాలి. భర్త అభిప్రాయం ఏకీభవించాలని ఒత్తిడి చేయవద్దని అనుకుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న భర్త కావాలని కోరుకుంటారట.

Also Read : బావగారు బాగున్నారా సినిమా లో సౌందర్య ని తీసేసి రంభ ని ఎందుకు తీసుకున్నారంటే ?

Visitors Are Also Reading