Home »  నవంబర్ లో ఈ 5 రాశుల వారు ధనవంతులు అవ్వడం పక్కా..!

 నవంబర్ లో ఈ 5 రాశుల వారు ధనవంతులు అవ్వడం పక్కా..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా ప్రతీ నెల కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశిని మార్చుకుంటూ ుంటాయి. కొన్ని రాశులకు శుభ ఫలితాలు మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను కలిగిస్తుంది. నవంబర్ నెల ప్రారంభమయ్యే కొద్ది.. నవంబర్ 11 నుంచి నవంబర్ 24 వరకు 5 ప్రధాన గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి వెళ్లబోతున్నాయి. నవంబర్ 11న శుక్రుడు, 13వ తేదీన మంగళ, బుధ, గ్రహాలు నవంబర్ 16న సూర్యుడు, 24న గురుడు మీన రాశిలో ప్రవేశించనున్నారు. దీంతో ఈ రాశి ప్రభావం ఏయే రాశులపై పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మేషరాశి  

Advertisement

మేష రాశి గురువు అయిన గురుడు వక్రమార్గం కారణంగా ఈ రాశి వారికి చాలా లాభం కలుగుతుంది. ఈ సమయంలో వారసత్వం లేదా ఇతర పద్దతుల్లో ప్రయోజనం పొందుతారు. సూర్య గోచారం కూడా కలిసొస్తుంది. ఈ కాలంలో వారికి విజయం వరిస్తుంది. వ్యాపారులకు శుక్ర గోచారం కలిసొస్తుంది. 

వృషభ రాశి 

 

నవంబర్ నెలలో ఈ రాశి వారు ఎన్నో బెనిఫిట్స్ పొందుతారు. అ ష్టం కలిసి వచ్చి వీరు ప్రతీ పనిలో కూడా విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఈ రాశి వారికి సూర్య సంచార సమయంలో ఆకస్మిక ధనాన్ని పొందే అవకాశముంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

కర్కాటక రాశి 

Advertisement

నవంబర్ నెలలో కర్కాటక రాశి జాతకులకు ప్రయోజనం చేకూరుతుంది. సూర్య గోచారం, గురు వక్రమార్గం శుభూచకంగా మారనుంది. ఈ సమయంలో వ్యాపారం లాభాన్నితెచ్చిపెట్టవచ్చు. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలం. కొత్త అవకాశాలు లభిస్తాయి. దీంతో పాటు కెరీర్ కూడా  వృద్ధి చెందుతుంది.

సింహం రాశి

శుక్రుని పరివర్తనం కారణంగా సింహరాశి వారికి మంచి లాభం చేకూరుతుంది. సింహ రాశిని పాలించే గ్రహంసూర్యుడు. సూర్యుని సంచారంలో మార్పు కారణంగా ఈ రాశి వారికి వ్యాపారంలో చాలా లాభాలు చేకూరుతాయి. వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలున్నాయి. ఆర్థిక కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో ఉద్యోగ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా పొందే అవకాశముంది. 

మీన రాశి 

సూర్యుని రాశి మార్పు మీన రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఏదైనా ఆస్తి లేదా కొత్త వాహనం కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. ఆఫీస్ లో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. కొత్త బాధ్యతలను పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది. అదృష్టంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భారీ లాభాలను పొందుతారు. అదేవిధంగా డబ్బు నష్టం కూడా కలిగే అవకాశముంది. 

Visitors Are Also Reading