Home » సంక్రాంతికి వచ్చే చిరు, బాలయ్య, విజయ్ సినిమాల్లో ఈ 5 పాయింట్లు కామన్ అనే విషయం మీకు తెలుసా ?

సంక్రాంతికి వచ్చే చిరు, బాలయ్య, విజయ్ సినిమాల్లో ఈ 5 పాయింట్లు కామన్ అనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా సంక్రాంతి పండుగ కోసం పెద్ద హీరోలు తమ సినిమాలు విడుదలయ్యేట్టు చూసుకుంటారు. తెలుగు, తమిళంలో సంక్రాంతి పండుగను సినిమా పండుగగా అభివర్ణిస్తారు. సంక్రాంతి పండుగ కోసం ముఖ్యంగా తెలుగు సినిమాలు పోటాపోటీగా విడుదలవుతుంటాయి. ఎప్పటిమాదిరిగానే ఈసారి పెద్ద హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, తమిళ హీరో విజయ్ దళపతి సినిమాలు విడుదలవుతున్నాయి. తాజాగా రెండు సినిమాలకు సంబంధించి బెర్తు ఖరారు అయింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంది. ఈ మూడు సినిమాల్లో 5 కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న చిత్రం వారసుడు. వంశీపైడిపళ్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.  రష్మిక మందన్న కథానాయిక. వారసుడు జనవరి 12, 2023న విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. అదేవిధంగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య, శృతిహాసన్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. జనవరి 12న విడుదలవుతున్నట్టు తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.  

Also Read :  మెగాస్టార్ వాల్తేరు వీరయ్య కథ అదేనా ? 

Advertisement

ఇప్పటికే విజయ్ దళపతి వారసుడు, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాల విడుదల తేదీని ప్రకటించడంతో చిరంజీవి ఎప్పుడూ వస్తారని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కే.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో చిరు నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. శృతిహాసన్ హీరోయిన్ నటిస్తోంది. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయినట్టు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ సినిమాలను నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్స్ కావడం విశేషం. ఇప్పటికే బాలయ్య సినిమాకి ప్రకటన వచ్చేసింది. చిరు చిత్రం అధికారికంగా విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. దాదాపు చిరంజీవి సినిమా జనవరి 13, 2023న విడుదలవ్వనున్నట్టు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

Also Read :  టాలీవుడ్ లో వ్యాపార‌వేత్త‌ల‌ను పెళ్లిచేసుకున్న 5 గురు స్టార్ హీరోయ‌న్స్ వీళ్లే..!

  1. వారసుడు, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మూడు సినిమాలు తెలుగు వర్ణమాల వ అక్షరంతో ప్రారంభం అవుతున్నాయి. వారసుడు, వీరసింహారెడ్డి ఇంగ్లీషులో V అక్షరంతో ప్రారంభమవ్వగా.. వాల్తేరు వీరయ్య మాత్రం W అక్షరంతో మొదలవుతుంది.
  2. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండు సినిమాలను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం.
  3. బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరి సినిమాల్లో కూడా హీరోయిన్ గాశృతిహాసన్ నటించడం విశేషం.
  4. వారసుడు, వీరసింహారెడ్డి రెండు సినిమాలకు కూడా థమన్ సంగీతం అందించడం ఆసక్తికరమైన అంశం.
  5. వీరసింహారెడ్డి, వారసుడు రెండు సినిమాలు కూడా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.

Also Read :  వీరసింహారెడ్డి విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే..?

Visitors Are Also Reading