Home » మీ కంటి చూపును తగ్గించే ఈ 5 అలవాట్లు.. మీరు తెలుసుకోవాల్సిందే..!!

మీ కంటి చూపును తగ్గించే ఈ 5 అలవాట్లు.. మీరు తెలుసుకోవాల్సిందే..!!

by Sravanthi
Ad

ఈ ప్రపంచంలో జరిగే ఏ సంఘటనను అయినా మన కళ్లు అద్భుతంగా చూపిస్తాయి. మన శరీరం కళ్ళ వల్లనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అంటే అతిశయోక్తి కాదు. మనకు తెలియకుండా కళ్లకు ఎంతో ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాం. అందులో మొదటిగా ..!

1. టీవీలు,మొబైల్స్, కంప్యూటర్లను ఎక్కువగా చూడటం వల్ల కళ్లు బాగా అలసిపోతాయి.

Advertisement

2. మన శరీరంలో బాగా సున్నితమైన ఆర్గాన్ మన కళ్ళు. చాలా మందికి కళ్ళు నలిపే అలవాటు ఉంటుంది. అలా చేస్తే కళ్ళలో ఉండే చిన్నచిన్న బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన చేతులు శుభ్రంగా ఉండవు. అందువల్ల కళ్లను రుద్దకూడదు.

3. బుక్స్ చదవడం చాలా మంచి అలవాటు గానీ ట్రావలింగ్ సమయంలో అలా చదవడం మంచి అలవాటు కాదు. ట్రావెలింగ్ చేసేటప్పుడు మన బాడీ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు బుక్ చదవడం వల్ల ఇబ్బంది తో మన కళ్ళు ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అలాగే ట్రావెలింగ్ చేసేటప్పుడు చాటింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు.

Advertisement

 

4. సన్ గ్లాసెస్ అంటే స్టైల్ కోసం మాత్రమే కాదు, మన కళ్ళను యూవీ కిరణాల నుండి రక్షించడానికి కూడా ఉపయోగపడతాయి. అందువల్ల ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకునే అలవాటు చేసుకోవాలి.

5. మనం ముందు చెప్పుకున్నట్లు గానే చదవడానికి,వర్క్ చేయడానికి రాత్రిపూట లో లైట్ ప్రాపర్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్. లైటింగ్ తక్కువగా ఉన్న ప్లేస్ లో చదివేటప్పుడు మన కళ్లు ఎక్కువ ఒత్తిడికి గురవుతాయి. అలాగే రాత్రుల్లో లైట్లు అన్ని ఆర్పేసి ఫోన్ చూడటం వల్ల ఆ బ్లూ రేస్ మన కళ్ళ మీద పడతాయి. అందువల్ల అలా కళ్ళని ఇబ్బంది పెట్టే పనులు ఎప్పుడూ చేయకూడదు.

 

Visitors Are Also Reading