Home » శివుని అంశతో పుట్టిన ఈ 4 రాశులవారు అదృష్టవంతులు.. వీరు సోమవారం ఏం చేయాలంటే..?

శివుని అంశతో పుట్టిన ఈ 4 రాశులవారు అదృష్టవంతులు.. వీరు సోమవారం ఏం చేయాలంటే..?

by Sravanthi

శివుని అంశతో పుట్టిన ఈ నాలుగు రాశుల వారికి ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. దీనివల్ల వీరికి జీవితాంతం డబ్బుల లోటు అనేది అస్సలు ఉండదు. ఈ నాలుగు రాశుల వారంటే శివునికి ఎంతో ఇష్టమట.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలాంటి రాశుల వారు ఎవరు.. వివరాలు ఏంటో చూద్దాం..
#1. కన్య రాశి :

కన్య రాశి వారి మనసు చాలా స్వచ్ఛమైనది. మనసులో ఏది దాచుకోకుండా బయట పెట్టేస్తారు. క్రమశిక్షణతో మెదులుతారు. పేదవారికి సహాయం అందిస్తారు. అందుకే ఈ రాశి వారంటే శివుడికి చాలా ఇష్టం. ఈ రాశి వారు సోమవారం శివుడికి పాలాభిషేకంతో పాటుగా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయాలి.

also read:Ramba car accident: హీరోయిన్ రంభ కారుకు యాక్సిడెంట్..!!

#2. కర్కాటక రాశి:

ఈ రాశికి చెందిన వారు ఎక్కువగా సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే శివుడి దయ కర్కాటక రాశి వారిపై ఉంటుంది. విరు సోమవారం రోజున ఆవుకు ఆహారం పెట్టడం చాలా మంచిది.
#3. మేషరాశి :

ఈ రాశికి చెందిన వారు ఎక్కువగా భగవన్నామస్మరణ చేస్తూ ఉంటారు. విరు ఇతరులకు చెడు అస్సలు చేయరు. ఏదైనా చెడు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడని నమ్ముతారు. అందుకే ఈ రాశి వారిపై శివుడి దయ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు సోమవారం పేదవారికి అన్నం పెట్టడం చాలా మంచిది.
#4. కుంభరాశి :

వీరు శివుడిపై భక్తి, శ్రద్ధ,భయం అనేది కలిగి ఉంటారు. ఎవరు కష్టాల్లో ఉన్న చూడలేరు. అమాయకంగా ఉంటారు. ఎవరినైనా తొందరగా నమ్ముతారు. అందుకే శివుడికి వీరంటే చాలా ప్రీతి. సోమవారం రోజున ఈ రాశి వారు శివనామస్మరణతో పాటుగా బీదవారికి సహాయం చేయాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

also read:క్యూట్ గా కనిపించే ఈ యువతి.. ఎంత దారుణమైన పని చేసిందంటే.. జ్యూస్ ఛాలెంజ్ పేరుతో..!

Visitors Are Also Reading