Home » పెళ్లికి ముందు ఈ 4 విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి..2వది చాలా ఇంపార్టెంట్..!!

పెళ్లికి ముందు ఈ 4 విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి..2వది చాలా ఇంపార్టెంట్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుత కాలంలో చాలామంది పెళ్లికి ముందు రిలేషన్ షిప్ లో ఉంటున్నారు.. ఇందులో ముఖ్యంగా డేటింగ్ అనేది ట్రెండింగ్ గా మారింది.. తాజాగా లివింగ్ రిలేషన్ షిప్ చర్చనీయాంశం అవుతుంది. ఈ రోజుల్లో పెళ్లికి ముందే సంబంధాలు పెట్టుకోవడం సర్వసాధారణం అయిపోయింది.. ఇలాంటి తరుణంలో జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్న మీరు తప్పనిసరిగా ఈ ఐదు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, చెడు రిలేషన్షిప్ మీ జీవితాన్ని నాశనం చేస్తుందని వారు అంటున్నారు.. రిలేషన్ షిప్ లో మనం పాటించాల్సిన 4నియమాలు ఏంటంటే…

Advertisement

#1. నీచులకు దూరంగా ఉండడం :తనతో పాటుగా తన అభిరుచి మరియు మరి ఇష్టా ఇష్టాలను కూడా గౌరవించే వ్యక్తి మంచి భాగస్వామి. అలాకాకుండా తన కోసం మాత్రమే ఉండి ఎవరి ఇష్ట ఇష్టాలు కూడా పట్టించుకోకుండా వారి పరిధి వరకు మాత్రమే చూసుకునే వారికి దూరంగా ఉండాలంటున్నారు.

ALSO READ:KTR TO CBN: అత్యధిక ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న రాజకీయ నాయకులు..!!

Advertisement

#2. అబద్ధాలు చెప్పడం :ముఖ్యంగా రిలేషన్షిప్ లో జీవిత భాగస్వామికి అబద్ధాలు చెప్పడం అనేది చాలా తప్పు.. కొంతమంది ఒక అబద్ధం చెప్పి ఆ అబద్దం దాచడానికి మరో అబద్ధం చెబుతూ ఇలా అబద్ధాలతోనే గడుపుతారు.. అలాంటి వారికి దూరంగా ఉండాలని, అలాంటి వారిని జీవిత భాగస్వామిని చేసుకుంటే సుఖ జీవనం ఉండదని అంటున్నారు. ఇలాంటివారు మొదట మంచిగా కనిపించినా తర్వాత మోసపూరిత వ్యక్తులుగా తయారవుతారని అంటున్నారు.

#3. నియంత్రణ: కొంతమంది వారి యొక్క జీవిత భాగస్వామి పట్ల చాలా వెరైటీగా ప్రవర్తిస్తారు.. భాగస్వామి ఏ పని చేసిన అందులో జోక్యం చేసుకుంటారు.. వారిని ఎప్పుడూ నియంత్రణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు.. అనుమానిస్తూ మీపై నిగా పెడుతూ ఉంటారు.. మంచి రిలేషన్ షిప్ లో ఇలా ఉండటం మంచిది కాదు. ఓవర్ గా ఎక్స్పోజ్ అయ్యి ఇబ్బందులు పెడుతుంటారు.. మీరు ఏం తినాలి ఏం ధరించాలి అనేది కూడా వారే నిర్ణయిస్తారు.. అనేక ఆంక్షలు కూడా పెడతారు.. జీవిత భాగస్వామి సెలక్షన్ విషయంలో ఇలాంటి వారికి దూరంగా ఉండాలి..
#4. కట్టుబడి ఉండడం :కొంతమంది పని విషయంలో సీరియస్ గా ఉండరు.. నిబద్ధతతో పని చేయరు.. అన్నింటినీ లైట్ తీసుకుంటూ ఉంటారు.. అలాంటి వారికి దూరంగా ఉండాలని, భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి ఆలోచనతో ఉండేవారిని, మాటకు కట్టుబడి ఉండే వారిని జీవిత భాగస్వామిగా చూసుకోవాలని అంటున్నారు.

ALSO READ:

Visitors Are Also Reading