Home » రియ‌ల్ లైఫ్ తండ్రీకొడుకులు రీల్ లైఫ్ లో క‌లిసి న‌టించిన ఈ 10 సినిమాలు అట్ట‌ర్ ఫ్లాప్..!

రియ‌ల్ లైఫ్ తండ్రీకొడుకులు రీల్ లైఫ్ లో క‌లిసి న‌టించిన ఈ 10 సినిమాలు అట్ట‌ర్ ఫ్లాప్..!

by AJAY

రియల్ లైఫ్ తండ్రీ కొడుకులు రీల్ లైఫ్ లో కూడా తండ్రీ కొడుకులుగా న‌టిస్తే ఆ సినిమా పై ఎన్నో అంచ‌నాలు ఉంటాయి. కానీ టాలీవుడ్ లో అలా వ‌చ్చిన 10 సినిమాలు అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన సినిమా ఆచార్య‌. ఈ సినిమాకు మొద‌టి షో నుండే ఫ్లాప్ టాక్ వ‌స్తోంది.

సాయికుమార్ త‌న‌యుడు ఆది ప్రేమ‌కావాలి సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యాడు. కాగా వీరిద్ద‌రూ క‌లిసి చుట్టాల‌బ్బాయ్ అనే సినిమాలో న‌టించారు. ఈ సినిమా డిజాస్ట‌ర్ గా నిలిచింది.

 

మంచు మోహ‌న్ బాబు ఇద్ద‌రు కుమారులు మ‌నోజ్, విష్ణు ల‌తో క‌లిసి పాండవులు పాండ‌వులు తుమ్మెద అనే సినిమాలో న‌టించారు. ఈ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ గా నిలిచింది.

బహ్మానందం త‌న కుమారుడు రాజా గౌత‌మ్ క‌లిసి ప‌ల్ల‌కిలో పెళ్లికూతురు అనే సినిమాలో కలిసి న‌టించారు.ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.

vamshi movie

vamshi movie

మ‌హేశ్ బాబు న‌మ్ర‌త క‌లిసి న‌టించిన వంశీ సినిమాలో సూప‌ర్ స్టార్ కృష్ణ కూడా న‌టించారు. ఇక ఈ సినిమా కూడా డిజాస్ట‌ర్ గా నిలిచింది.

ఎన్టీరామారావు, బాల‌కృష్ణ క‌లిసి అక్బ‌ర్ స‌లీం అనార్క‌లీ అనే సినిమాలో న‌టించారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

మంచు మోహ‌న్ బాబు మంచు విష్ణు క‌లిసి గేమ్ అనే సినిమాలో న‌టించారు. ఈ సినిమా కూడా బోల్తా కొట్టింది.

మ‌హేశ్ బాబు గౌత‌మ్ క‌లిసి న‌టించిన సినిమా నేనొక్క‌డినే. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.

మోహ‌న్ బాబు మంచు విష్ణు క‌లిసి న‌టించిన సినిమా గాయ‌త్రి. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

AlSO READ :

“ఆచార్య” లో యంగ్ చిరు దర్శనం….ఇదెక్కడి వీఎఫ్ఎక్స్ బాబోయ్ అంటూ నెట్టింట ట్రోల్స్…!

రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వచ్చినా వదులుకున్న కార్తీకదీపం నటి..!

Visitors Are Also Reading