టాలీవుడ్ సినీయర్ నటీమణులలో విజయశాంతి ఒకరు. ఆమె ఒకప్పుడు ఎక్కువగా లేడీస్ ఓరియెంటేడ్ సినిమాలు తీసి సూపర్ సక్సెస్ సాధించింది. ముఖ్యంగా విజయశాంతిని లేడీ అమితాబ్ అని పిలిచేవారు. ముఖ్యంగా ఆమె సినిమా చేసినా హీరోలతో సమనంగా క్రేజ్ సంపాదిచుకుంది. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు వంటి సీనియర్ హీరోలతో నటించి.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జు, వెంకటేష్ యువతరం హీరోలతో కూడా సినిమాలు చేసి హిట్లు కొట్టింది. మరోవైపు కర్తవ్యం, ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ, భారతరత్న వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది.
Also Read : ఛార్మి వల్లేనా ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోలేదు?
Advertisement
ప్రధానంగా కర్తవ్యం సినిమాకు నేషనల్ అవార్డు అందుకుంది. ప్రతిఘటన సినిమాకి నంది అవార్డును అందుకుంది. ఇలా ఎన్నో అవార్డులను దక్కించుకుంది విజయశాంతి. ఈమె గ్లామర్ పాత్రల్లో కూడా ప్రేక్షకులను మెప్పించారు. హీరోలతో సమానంగా డ్యాన్స్ వేసి అభిమానులను పెంచుకున్నారు. 1990లో చిరంజీవి, విజయశాంతి కాంబో అంటే హిట్ ఫెయిర్ అనే పేరు వచ్చింది. దాదాపు 19 సినిమాల్లో చిరంజీవికి జంటగా నటించింది. బాలకృష్ణతో దాదాపు 17 సినిమాలు చేసి హిట్ ఫెయిర్ గా నిలిచారు. ఇక స్వయంకృషి, పడమటి సంధ్యారాగం వంటి విభిన్న సినిమాలతో పాటు ఒసేయ్ రాములమ్మ ప్రతిఘటన వంటి విభిన్నమైన చిత్రాలతో అలరించి లేడీ సూపర్ స్టార్ అయింది. చిరంజీవి, విజయశాంతి పెయిర్ అనగానే హిట్ పెయిర్ అనే ముద్ర పడిపోయింది.
Advertisement
Also Read : భార్య భర్తను ఇలా చూసుకుంటే భర్త మరో స్త్రీ వైపు వెళ్లడు
ఇక ఆన్ స్ట్రీన్ లో వారి మధ్య కెమిస్ట్రీ అంత అందంగా కుదిరింది మరి. బయట కూడా ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. అలాంటిది విజయశాంతి, చిరంజీవి దాదాపు 20 ఏళ్ల వరకు మాట్లాడుకోలేదు. ఈ విషయంపై విజయశాంతి ఓసారి స్పందిస్తూ.. రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత ప్రత్యర్థులుగా ఉన్నా విభేదాలు వస్తాయని, తెలంగాణ ఉద్యమం సమయంలో ఎంతో మంది సినిమా పరిశ్రమ నుంచి మద్దతు ఇవ్వమని అడిగినా ఎవ్వరూ స్పందించలేదు. సహాయం చేయకపోయినా కానీ స్పందించి ఉంటే బాగుండేదని అనిపించింది. అప్పటి నుంచి మాట్లాడలేదని వివరించారు విజయశాంతి. ముఖ్యంగా రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత సినిమాల్లో నటించలేదు. చాలా ఏళ్ల గ్యాప్ తరువాత మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించింది.