THEGIMPU MOVIE REVIEW IN TELUGU: తమిళ స్టార్ హీరో అజిత్ తాజాగా నటించిన సినిమా తెగింపు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేశారు. ఈ చిత్రంలో మంజు వారియర్ హీరోయిన్ గా నటించింది. సముద్రఖని అజిత్ ను ఢీకొట్టే పాత్రలో విలన్ గా నటించాడు. ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా… బోనికపూర్ నిర్మించారు. జిబ్రాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా నేడు విడుదల చేశారు. మరి ఈ సినిమా విజయం సాధించిందా..? అజిత్ ఖాతాలో మరో హిట్ పడిందా..? అన్నది ఇప్పుడు చూద్దాం…
Thegimpu Movie Story in Telugu
సినిమా కథ : ఓ బ్యాంకులో 500 కోట్ల రూపాయలను కొట్టేయడానికి దొంగలు ప్లాన్ చేసి చొరపడతారు. ఆ బ్యాచ్ లోకి హీరో (అజిత్) డార్క్ డెవిల్ సైతం ఎంట్రీ ఇస్తాడు. అయితే అప్పటివరకు 500 కోట్ల రూపాయల దొంగతనం జరుగుతుందని అంతా భావిస్తారు. కానీ అసలు దొంగతనం మాత్రం 25 వేల కోట్ల రూపాయలు అని తెలిసేసరికి షాక్ అవుతారు. అసలు 25 వేల కోట్ల రూపాయలు ఒక బ్యాంకులోకి ఎలా వచ్చాయి..? ఎందుకు వచ్చాయి..? ఆ విషయం డార్క్ డెవిల్ కు ఎలా తెలిసింది… అసలు దొంగతనం ఎందుకు చేస్తారు..? అన్నదే ఈ సినిమా కథ.
Advertisement
Advertisement
THEGIMPU MOVIE REVIEW IN TELUGU: విశ్లేషణ :
అజిత్ గ్యాంబ్లర్ సినిమాలో యాంటీ హీరో రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. తెగింపు సినిమాలోనూ అలాంటి రోల్ లోనే నటించాడు. అయితే ఈ సినిమాలో కీలకమైన బ్యాక్ స్టోరీ జస్టిఫికేషన్ మాత్రం మిస్సయింది. దాంతో ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమాలో విలన్ పాత్ర కు సముద్రఖని న్యాయం చేయలేకపోయాడు. విలన్ పాత్ర సో సో గా ఉండటం సినిమాకు పెద్ద మైనస్ అయింది.
ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు అజయ్ నెగిటివ్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా నటించిన మంజు వారియర్ కొన్ని సన్నివేశాలకే పరిమితం అయిపోయింది. ఈ చిత్రాన్ని మనీ హేస్ట్ రేంజ్ లో ప్రేక్షకులు ఊహించారు. కానీ సిల్లిగా ఎలాంటి ఎమోషన్ కనెక్టివిటీ లేకుండా ఉండటంతో ప్రేక్షకులను నిరాశపరిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే అజిత్ ఫ్యాన్స్ కు ఈ సినిమా నచ్చిందేమో కానీ మిగతా ప్రేక్షకులకు మాత్రం పెద్దగా నచ్చదు.
Also read : Varasudu Review Telugu: “వారసుడు” రివ్యూ..విజయ్ కి షాక్ తప్పదా ?