కరోనా.. మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. అన్ని ఇండస్ట్రీలు నష్టపోయాయి. అందులో సినిమా ఇండస్ట్రీ కాస్త ఎక్కువగానే నష్టపోయిందని చెప్పాలి. ఇక కరోన రాకముందు ప్రతి వారం రెండు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. అందులో కనీసం ఏదో ఒకటి అయినా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటే ఓ మోస్తరులో వసూళ్లు వచ్చేవి. ప్రస్తుతం పరిస్థితి అలాలేదు. మొత్తం సినిమాల పరిస్థితి మారింది. జనాలు సినిమాలకు సక్సెస్ టాక్ వస్తేనే థియేటర్లకు వెళ్లి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మౌత్ టాక్ తో పాటు సోషల్ మీడియా రివ్యూలను చూసి సినిమాలకు వెళ్తున్న వారు ఉన్నారు.
సినిమాకి ఎంతో మంచి టాక్ వస్తేగాని రిస్క్ తీసుకుని జనాలు థియేటర్లకి రారు. ఇక ఇలాంటి ప్యాండమిక్ సిట్యువేషన్‌లో రిస్క్ తీసుకుని చిన్న సినిమాల పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. పెద్ద సినిమాలు అయినా పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదు. అలా గత మూడు వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి కరువయ్యింది.
Advertisement
Advertisement
దసరా సీజన్ తర్వాత మళ్లీ బాక్సాఫీస్ వద్ద హడావుడి లేదు. దీపావళికి వచ్చిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా ఆకట్టుకోలేక పోయింది. దాంతో జనాలు దీపావళి సినిమాలను థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపించకుండా లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత వారంలో అంటే గత వారంలో పుష్పక విమానం సినిమా వచ్చింది. ఆ సినిమాకు గొప్పగా ఉందన్న టాక్ రాలేదు. దాంతో జనాలు ఆ సినిమాలను కూడా లైట్ తీసుకున్నారు.
రాజా విక్రమార్క సినిమా కూడా జనాలను ఆకట్టుకోవడంలో విఫలం అవ్వడంతో గత వారం థియేటర్ల వద్ద జనాలు కనిపించలేదు. ఇక ఈ వారంలో సినిమాలు పెద్దగా విడుదలే లేవు. నేడు ప్రేక్షకుల ముందుకు రెండు చిన్న సినిమాలు వచ్చాయి. అవి కూడా పెద్దగా సందడి చేస్తాయన్న నమ్మకం లేదంటూ బాక్సాఫీస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వరుసగా మూడు నాలుగు వారాలుగా సరైన సినిమాలే రాకపోవడంతో థియేటర్ల యాజమాన్యాలు జుట్టు పీక్కోవాల్సిన పరిస్థితి నెలకొనింది. సినిమాలను తీసుకోవాల్సిందే.. వాటికి జనాలు రాకపోవడం వల్ల మెయింటెన్స్ కూడా రాకపోవడంతో నష్టపోవాల్సి వస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితులు ఇంకా ఎన్ని రోజులో అంటూ వారు ఆవేదన చెందుతున్నారు. వచ్చే వారంలో కూడా గొప్ప సినిమాలు ఏమీ లేవు. కనుక వరుసగా నాల్గవ వారం కూడా బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించక పోవచ్చు అంటున్నారు. డిసెంబర్ మొదలు అయితే పరిస్థితి ఏమైనా మారుతుందేమో చూడాలి.