Home » U19 WORLD CUP : ప్రపంచ కప్ ఫైనల్ కి దూసుకెళ్లిన యంగ్ టీమిండియా

U19 WORLD CUP : ప్రపంచ కప్ ఫైనల్ కి దూసుకెళ్లిన యంగ్ టీమిండియా

by Anji

అండర్ 19 ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుత విజయాలతో దూసుకెళ్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదోసారి ప్రపంచ కప్ పైనల్ లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. లక్ష్య ఛేధనలో టీమిండియా 48.5 ఓవర్లలో టార్గెట్ పూర్తి చేసి విజయాన్ని అందుకుంది.

ముఖ్యంగా సచిన్ దాస్ (96), ఉదయ్ (81) అర్థ శతకాలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్టు తలపడనున్నాయి. గ్రూప్ స్టేజీ నుంచి సూపర్ సిక్స్ వరకు ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ విజయం సాధించిన టీమిండియా ప్రపంచ కప్ లో తొలిసారి సవాల్ ఎదుర్కోవాల్సి వచ్చింది. లక్ష్య ఛేదనలో టీమిండియా 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ సహారన్ ఉదయ్, సచిన్ 171 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యంతో భారత్ కి అద్భుతమైన విజయాన్ని అందించారు.

 

దక్షిణాఫ్రికా నిర్దేశించిన 245 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా త్వరగానే 4 టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. ఆదర్శ్ సింగ్ 0, ముషీర్ ఖాన్ 4, అర్షీన్ కులకర్ణి 4, ప్రియాంషు సహరన్ 5 పరుగులు చేసి ఔట్ అయ్యారు. టీమిండియా 40 పరుగుల్లోపై 4 కీలక వికెట్లును చేజార్చుకుంది. ఆ తరువాత సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహారన్ ఇద్దరూ ఐదో వికెట్ కి 171పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో సచిన్ ఔట్ అయ్యాడు. మ్యాచ్ రసవత్తరంగా మారిన సమయంలో రాజ్ లింబానీతో కలిసి కెప్టెన్ ఉదయ్ టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. దక్షిణాఫ్రికా కూడా ధీటుగా పోరాడింది. టీమిండియా తరపున ట్రిస్టన్ లూస్, క్వేనా మఫాకా చెరో 3 వికెట్లు తీశారు.

 

Visitors Are Also Reading