పెళ్లైన మహిళలు తాళిబొట్టుని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి తాళిబొట్టును భర్త చనిపోయిన తర్వాత తీసేస్తారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మహిళ తన తాళిబొట్టు ను తీసి పోలీస్ అధికారి ముఖంపై విసిరికొట్టింది.. మరి ఆ తల్లికి కలిగిన అంత బాధ ఏంటో ఓ సారి చూద్దాం..? రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ మహిళ భర్తను చంపిన వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని సదరు మహిళ పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగింది.
Advertisement
ఈ తరుణంలోనే తన మెడలో నుంచి తాళిబొట్టు తీసి సిఐ ముఖంపై విసిరికొట్టింది. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన ఈ గొడవ హత్య వరకు దారితీయడంతో ఈ విషయం కాస్త పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. పూర్తి వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దేవుడి నరసయ్య అనే వ్యక్తిని ట్రాక్టర్ తో డి కొట్టించి హత్య చేశారు. ఇది చేసింది ప్రత్యర్థి కిషన్. దీంతో దీంతో మొదటి కుటుంబ సభ్యులు బంధువులు కిషన్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మృతుడి తరఫున వారు స్టేషన్ కి వెళ్లారు. అనంతరం ఆగ్రహంతో స్టేషన్ పై దాడికి దిగారు.
Advertisement
అడ్డం వచ్చిన పోలీసులను కూడా చితకబాదారు. చందుర్తి సిఐ, రుద్రంగి ఎస్ఐ వల్లే ఈ హత్య జరిగిందని మృతుడి బంధువులు ఆరోపణలు చేశారు. పోలీసుల వ్యవహారం పై మృతుడి భార్య తీవ్రంగా ప్రతిఘటించింది. నా భర్తను చంపిన వ్యక్తులకు పోలీసులు అండగా నిలుస్తున్నారని, ఆయన పోయాక నాకు తాళిబొట్టు అక్కర్లేదు అంటూ చందుర్తి సీఐపై మంగళసూత్రాన్ని తీసేసి విసిరేసింది. దీంతో పోలీస్ స్టేషన్ ఆవరణలో తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. వెంటనే వేములవాడ డిఎస్పి నరేంద్ర అక్కడికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
also read;
ఉత్తర కొరియాలో అంతు చిక్కని కొత్త వ్యాధి.. భయాందోళనలో హోజూ నగరవాసులు..!
సాఫ్ట్ వేర్ జాబ్ వదిలి.. గాడిదల పెంపకంలోకి దిగి.. లక్షలు సంపాదిస్తున్నాడు..!!