Home » Mitchell Marsh : వరల్డ్ కప్ గెలిచాక.. ఇంత బలుపా ?

Mitchell Marsh : వరల్డ్ కప్ గెలిచాక.. ఇంత బలుపా ?

by Bunty
Ad

2023 వన్డే వరల్డ్ కప్ లో లీగ్ దశలో అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియా ఫైనల్ మ్యాచ్ లో చేతులెత్తేశారు. ఆఖరిపోరులో తడబడ్డారు. ఆసిస్ తో జరిగిన ఫైనల్ లో టీమిండియా ఘోరఓటమి పాలయ్యింది. ఈ మ్యాచ్ లో టీమిండియా కప్పు కొడుతుందని అంతా భావించారు. కానీ కప్పు మాత్రం మిస్ అయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్ తీసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా విఫలం అయింది. బ్యాటింగ్ లో భారీ స్కోర్ చేయలేదు. కోహ్లీ, రాహుల్ హాఫ్ సెంచరీ, రోహిత్ 47 పరుగులు మినహా ఎవరూ కూడా మంచి స్కోర్ చేయలేదు.

The viral photo of Mitchell Marsh with the World Cup trophy

The viral photo of Mitchell Marsh with the World Cup trophy

గిల్, అయ్యర్, సూర్య, జడేజా పూర్తిగా నిరాశపరిచారు. దాంతో టీమిండియా 50 ఓవర్లలో 240 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. ఆసీస్ బౌలర్స్ అద్భుత ప్రదర్శన చేశారు. మిచెల్ స్టార్క్ 3, పాట్ కమిన్స్, హేజిల్ వుడ్ రెండేసి వికెట్లు తీశారు. దాంతో టీమ్ ఇండియా భారీ స్కోర్ చేయలేదు. ఇక బౌలింగ్ లో అయినా కట్టడి చేస్తుందని భావించారు. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు తీసి బౌలర్స్ ఆశలు లేపారు. కానీ తర్వాత సీన్ రివర్స్ అయింది. ట్రావిస్ హెడ్ భారీ సెంచరీ, లబుషేంగ్ హాఫ్ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేశారు. మిగతా బౌలర్స్ అందరూ వికెట్లు తీయలేక భారీగా పరుగులు ఇచ్చారు.

Advertisement

Advertisement

దాంతో ఆసిస్ జట్టు 43వ ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. దాంతో వరల్డ్ కప్ ను ఆరవసారి ఆస్ట్రేలియా తన ఖాతాలో వేసుకుంది. 2015లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా మళ్ళీ ఇప్పుడు 2023లో కప్పు గెలవడం విశేషం. ఇండియన్ బౌలర్లలో బూమ్రా రెండు, షమీ, సిరాజ్ చెరో వికెట్ తీశారు. ఇది ఇలా ఉండగా.. ఆరోసారి వరల్డ్ కప్ గెలవడంతో ఆస్ట్రేలియా మరోసారి తన బుద్ధిని చూపించింది. 2006లో ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకునే సమయంలో బీసీసీఐ ప్రెసిడెంట్ తో ఆసీస్ అమర్యాదగా ప్రవర్తించడం ఇంకా అందరికీ గుర్తే. తాజాగా వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆ కప్పుతో ఫోటోలు దిగారు. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ WCపై కాళ్లు పెట్టి, బీర్ తాగుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. WCని ఆసీస్ అవమానించిందని క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading