Home » ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన కథతో హిట్ అందుకున్న గోపీచంద్..ఆ సినిమా ఏదంటే..?

ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన కథతో హిట్ అందుకున్న గోపీచంద్..ఆ సినిమా ఏదంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

గోపీచంద్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో తొలివలపు సినిమా చేసి ఫ్లాప్ ను మూటగట్టుకున్నారు. ఆ తర్వాత విలన్ పాత్రలు చేసి ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. ఇక ఆయన అన్ని విలన్ పాత్రలే చేస్తారని భావించారు. మొదట్లోనే జయం, నిజం, వర్షం లాంటి సినిమాలు చేసి ఓ రేంజ్ లో విలన్ పాత్రతో ఆకట్టుకున్నాడు గోపీచంద్.

Advertisement

Advertisement

విలన్ గా గోపీచంద్ సక్సెస్ అయినా కానీ హీరోగా చేయాలని ఆయన మనసులో ఉండేదట. ఈ తరుణంలోనే సడన్ గా ఒక సినిమా చేసి ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. దీంతో గోపీచంద్ కెరీర్ మారిపోయింది. ఆయన విలన్ గానే కాకుండా హీరోగా కూడా మెప్పించగలడనే రేంజ్ కి వచ్చాడు. మరి ఆయన మొదటగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏంటో ఒక సారి చూద్దాం..? గోపీచంద్ విలన్ పాత్ర నుంచి తప్పుకొని ఒక్కసారిగా హీరోగా యజ్ఞం సినిమాతో సక్సెస్ కొట్టి హీరోయిజానికి బాటలు వేసుకున్నాడు. అయితే ఈ సినిమా గోపీచంద్ కంటే ముందుగా మరో ఇద్దరు హీరోల దగ్గర వెళ్లిందట. వారు నో చెప్పడంతోనే గోపీచంద్ కు వచ్చి బ్లాక్ బస్టర్ ఇచ్చిందని చెప్పాలి. ఆ ఇద్దరు హీరోలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు కళ్యాణ్ రామ్. ఈ ఇద్దరి దగ్గరికి కథ ముందుగా చెప్పడానికి వెళ్ళినప్పుడు వారిద్దరూ అప్పుడే కెరీర్ మొదలు పెట్టారు కాబట్టి కొత్త దర్శకుడితో కాకుండా సీనియర్ డైరెక్టర్లతో చేస్తే బాగుంటుందని వారు ఈ సినిమాకి నో చెప్పారట. ఆ తర్వాత అనుకోకుండా ఈ కథ గోపీచంద్ దగ్గరికి వెళ్లిందట.. దీనికి గోపీచంద్ ఓకే చెప్పాడు. వెంటనే దర్శకుడు సినిమా స్టార్ట్ చేసి షూటింగ్ పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకువచ్చారు. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. దీని తర్వాత గోపీచంద్ వరుసగా యాక్షన్ సినిమాలలో చేస్తూ మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ విధంగా తన కెరీర్ ని మొదలుపెట్టి దూసుకుపోతున్నారు హీరో గోపీచంద్.

ALSO READ;

ఆడవాళ్ళ చేతి వేళ్లు ఇలా ఉంటే.. భర్తకు అదృష్టం..!!

మూడో భార్యతో ప్రాణహాని ఉందంటూ నరేష్ సంచలన ఆరోపణలు..ట్విస్ట్ ఏంటంటే..?

 

Visitors Are Also Reading