Home » శోక సంద్రంలో మునిగిపోయిన మహేష్ బాబు ఇంట్లోకి చిరునవ్వులు తీసుకొచ్చిన ఇద్దరమ్మాయిలు

శోక సంద్రంలో మునిగిపోయిన మహేష్ బాబు ఇంట్లోకి చిరునవ్వులు తీసుకొచ్చిన ఇద్దరమ్మాయిలు

by Anji
Ad

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఈ మధ్యే మరణించిన విషయం విధితమే. కృష్ణ గారు లేరనే విషయాన్ని కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవలే జరిగిన కృష్ణ  పెద్దకర్మ కార్యక్రమంలో మహేష్ బాబు ఎమోషనల్ అయ్యాడు. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణ కుటుంబంలో కేవలం మహేష్ బాబు ఫ్యామిలీ గురించి మాత్రమే అందరికీ తెలుసు. మిగతా ఫ్యామిలీలు ఉనన కానీ వారి గురించి చాలా మందికీ తెలియదు. ఇప్పుడు రమేష్ బాబు కూతురితో నమ్రత దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఎనలేని ప్రజాదరణ పొందాడు.

Advertisement

ముఖ్యంగా మహేష్ చేసినది తక్కువ సినిమాలు అయినప్పటికీ తెలుగులో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కృష్ణ వారసులలో మహేష్ బాబు ఒక్కరే హీరోగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కృష్ణ వారసులు మహేష్ బాబుతో పాటు రమేష్ బాబు, మంజుల కూడా వెండితెరపై కనిపించారు. కానీ పెద్దగా ఆదరణ పొందలేకపోయారు. వారు ఏం చేస్తున్నారు.. వీరు ఏం చేస్తున్నారు ? ఎక్కడ ఉంటున్నారు అనేది కృష్ణ అభిమానులకు పెద్దగా తెలిసేది కాదు. మహేష్ బాబు అతని భార్య నమ్రత, పిల్లలు గౌతమ్ సితార ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ అభిమానులను కనువిందు చేస్తుంటారు. 

Advertisement

Also Read :  సమంత ఆరోగ్యం పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన సమంత టీమ్..!!

రీసెంట్ గా కృష్ణ మరణించడంతో విదేశాల్లో ఉంటున్న రమేష్ గారి పిల్లలు కూడా హైదరాబాద్ కు వచ్చారు.   తండ్రి రమేష్ బాబు మాదిరిగానే చాలా అందంగా ఉన్న జయకృష్ణ హీరో అయ్యే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రమేష్ బాబు కూతురు భారతి కూడా చాలా అందంగానే ఉంది. సితార, భారతి కలిసి తీసుకున్న ఓ ఫోటో మహేష్ బాబు భార్య నమ్రత ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు క్యాప్షన్ “ఈ ఇద్దరమ్మాయిల వల్ల ఇంట్లో నవ్వులొచ్చాయి” అంటూ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ అమ్మాయిలు ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  

Also Read :  ప‌న‌న్ రీల్ హీరో కాదు రియ‌ల్ హీరో..ఆ అమ్మాయి పెళ్లి ఎంత సాయం చేశారంటే..?

Visitors Are Also Reading