Home » ‘అనిత ఓ అనిత పాట’ పాడిన నాగరాజు జీవితంలో జరిగిన విషాద ఘటనలు ఇవే..!

‘అనిత ఓ అనిత పాట’ పాడిన నాగరాజు జీవితంలో జరిగిన విషాద ఘటనలు ఇవే..!

by Anji
Ad

‘అనిత ఓ అనిత నా అందమైన అనిత’  ఈ సాంగ్ గురించి తెలియని వారు ఎవ్వరు ఉండరు. దాదాపు 15 సంవత్సరాల కిందట ఈ పాట ఎంతటి సంచలనం  సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏ ఫంక్షన్ జరిగినా ఇంట్లో ఉన్నటువంటి టేపు రికార్డులలో, సీడీ, డీవీడీ ప్లేయర్లలో, ట్రాక్టర్లు, ఆటోల్లో, మైకుల్లో ఈ పాట మారుమ్రోగిపోయేది. వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద అందరి నోళ్లలో ఈ పాట వినిపించేది. అప్పట్లో అంతటి సంచలనాన్ని క్రియేట్ చేసిన ఈ పాట పాడిన, రాసిన వ్యక్తి పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ వ్యక్తి పేరు నాగరాజు. ఫస్ట్ పాటతోనే అతడు చాలా ఫేమస్ అయ్యాడు.  

Also Read :  శాకుంతలం ఎఫెక్ట్…స‌మంత‌కు ఫ్యూచ‌ర్ లో క‌ష్టాలు త‌ప్ప‌వా..?

Advertisement

ఈ పాట అప్పట్లో సంచలనం సృష్టించడంతో ఈ పాట రాసిన నాగరాజు సినిమాల్లో రాణిస్తాడని అనుకున్న తరుణంలోనే ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. దాదాపు 10 ఏళ్ల తరువాత మళ్లీ వెలుగులోకి వచ్చాడు నాగరాజు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన  ఇంటర్వ్యూ లో అతని జీవితంలో చోటుచేసుకున్న పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా లవ్ బ్రేకప్.. పిల్లల అనారోగ్యం వంటి వాటి గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నాగరాజు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. నేను, అనిత ప్రేమించుకున్నాం. ఇద్దరికీ బ్రేకప్ అయింది. వారింటి వాళ్లు వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరం విడిపోయాం. 

Advertisement

Also Read :  బంగారం లాంటి అమ్మాయి.. 3 కోట్ల కట్నం..  తాళి కట్టడానికి ముందు ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

అనితతో బ్రేకప్ తరువాత బాధలో ‘అనిత ఓ అనిత’ అనే పాటను రాశాను. దాదాపు నెల రోజులకు పైగా కష్టపడి పాట రాశాను. నేను ఓ సింగర్ ని. ఆర్కేస్ట్రాలో పని చేసేవాడిని. స్వయంగా నేనే ఈ పాటను రాసి పాడాను. ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరిగింది. నాకు కూడా వేరే అమ్మాయితో పెళ్లి అయింది. నాకు చాలా మంచి అమ్మాయి భార్యగా వచ్చింది. తన పేరు దేవిక. మాకు ఇద్దరు పిల్లలు కలరు. మా పెద్ద అబ్బాయికి మూగ, చెవుడు. పెద్దబ్బాయితో ఉండి చిన్నబ్బాయి కూడా సైగలు చేస్తూ ఉంటాడు. ఇక ఊర్లో ఎవరైనా పిలిస్తే పాటలు రాసి ఇచ్చే వాడిని. పాన్ షాపుతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. ఆ కళామాతల్లి నన్ను కాపాడుతుందని మళ్లీ హైదరాబాద్ కి షిప్ట్ అయ్యాం. త్వరలో అనిత 2 పాట రాబోతుంది. ఇప్పటికే కంపోజింగ్ అయిపోయింది” అని చెప్పుకొచ్చాడు నాగరాజు. 

Also Read :  రామ్ జగడం మూవీ హీరోయిన్ ఇప్పుడేలా ఉందో తెలుసా..?

Visitors Are Also Reading