Home » మొగుడు ఉండగానే రెండో పెళ్లి చేసుకోకుండా బిడ్డకి జన్మనిచ్చిన టాప్ హీరోయిన్..!

మొగుడు ఉండగానే రెండో పెళ్లి చేసుకోకుండా బిడ్డకి జన్మనిచ్చిన టాప్ హీరోయిన్..!

by Anji
Ad

మలయాళ హీరోయిన్ రేవతి అసలు ఆశా కేలుని నాయర్.  ఈమె తండ్రి ఆర్మీ ఆఫీసర్ కాగా.. ఆమె చిన్నతనం నుంచే భరత నాట్యం నేర్చుకుంది. స్కూల్ లో చదువుకుంటున్న రోజుల్లో ఫోటోలు అప్పట్లో తమిళ, మ్యాగజైన్ ముఖ చిత్రం పై రావడంతో అది చూసిన డైరెక్టర్ భారతీరాజా తాను తీయబోయే మన్ వాసవై సినిమాలో తీసుకున్నాడు. తెలుగులో రేలంగి నరసింహరావు దర్శకత్వం వహించిన మానసవీణ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ లో కూడా బిజీ ఆర్టీస్ట్ గా మారిపోయింది. రేవతి మలయాళంలోనే ఎక్కువగా నటించింది. ఆమె సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లో పట్టు సాధించి దర్శకురాలుగా మారింది. వేరే విాభాగాల్లో నేషనల్ అవార్డులు, ఫిల్మ్ ఫెయిర్ అవార్డులను దక్కించుకుంది. 

Advertisement

ఆమె సినిమాలో నటిస్తున్న సమయంలో మలయాళ దర్శకుడు సురేష్ చంద్ర మీనన్ తో ప్రేమలో పడింది. పుతియ ముఖమ్ అనే సినిమాలో సురేష్ రేవతి కలిసి నటించారు. ఆ సినిమాకి అతడే డైరెక్టర్. 1986లో వీరి పెళ్లి జరిగింది. ఆ తర్వాత కూడా రేవతి సినిమాలో చేసింది. అయితే సినిమాలో నటించాలని ఉద్దేశంతో సురేష్ మొదట్లో పిల్లలను కనకూడదు అని కండిషన్ పెట్టాడు. కెరీర్ ముగిసాక పిల్లలు కావాలనుకున్న వారికి సంతానం కలగలేదు. ఈ విషయంలో ఇద్దరికీ భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. రేవతి మాత్రం సినిమా ఇండస్ట్రీలో బిజీగా గడిపింది. అలాగే తల్లి కావాలని కూడా నిర్ణయించుకుంది.

Advertisement

Also Read : Avatar 2 Trailer : అవతార్ 2 ట్రైలర్.. విజువల్స్ వండర్

రేవతి తన 48వ పుట్టినరోజు నాడు తాను ఒక బిడ్డకు తల్లి అయ్యాను అంటూ ప్రకటించింది. అయితే అందరూ ఈ వయసులో మరో పెళ్లి చేసుకోకుండా మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా ఎలా తల్లి అయిందని అనుమానం వ్యక్తం చేశారు. అందరూ నటి శోభన లాగా ఒక పాపను దత్తత తీసుకుంది అని అనుకున్నారు. కానీ తన కూతురికి తాను సొంత తల్లి అని ప్రకటించింది. దాంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ బిడ్డకి తండ్రి ఎవరు అనే మాట ఎక్కువగా వినిపించింది. అయితే రేవతి ఐవిఎఫ్ పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లుగా తెలిసింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. తల్లి కావాలని రేవతి ఆశయం ముందు ఆమె తండ్రి ఎవరు అన్న ప్రశ్న చిన్న దైపోయింది. ఆ విధంగా రేవతి మహి అనే బిడ్డకు జన్మనిచ్చింది.

 

Also Read : ఈ బాబును గుర్తుపట్టారా.. అప్ కమింగ్ హీరో.. కోట్లాది ఆస్తులకు వారసుడు.. ఎవరో చెప్పుకోండి..?

 

Visitors Are Also Reading