Home » ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి.. ఎక్క‌డో తెలుసా..?

ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి.. ఎక్క‌డో తెలుసా..?

by Anji
Ad

ప్ర‌పంచంలో అనేక రైల్వే బ్రిడ్జిలున్నాయి. అందులో కొన్ని అత్యంత ఎత్తున ఉన్నాయి. ఇప్పుడు ప్ర‌పంచంలో ఉన్న అన్ని రైల్వే బ్రిడ్జిల కంటే ఎత్తైన రైల్వే బ్రిడ్జి సిద్ధ‌మ‌వుతుంది. అది ఎక్క‌డుంది. దాని ప్ర‌త్యేక‌త‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి మన భారతదేశంలోని చీనాబ్ నదిపై నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడంలో చీనాబ్ రైలు వంతెన ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Advertisement

Also Read :  Chanakya Niti : మ‌నిషి సంపాద‌న ఈ నాలుగు విధాలుగా ఖ‌ర్చు చేయాలట‌

ప్ర‌స్తుతం కాశ్మీర్ నుంచి ఢిల్లీకి రావ‌డానికి ట్ర‌క్కుల‌ను 48 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. బ్రిడ్జీ ప్రారంభం అయితే రైళ్ల ద్వారా కేవ‌లం 20-22 గంటల్లోనే కాశ్మీర్ సరుకులు ఢిల్లీకి చేరుకుంటాయి. దీంతో స‌రుకులు ర‌వాణా ఖ‌ర్చు త‌గ్గుతుంది. వ్యాపారుల‌కు లాభాలు పెరుగుతాయి. అదేవిధంగా కాశ్మీరీ స‌రుకులు చౌక‌గా ల‌భిస్తాయి. ఈ బ్రిడ్జీ ద్వారా వివిధ రాష్ట్రాల్లో ఉండే ప్ర‌జ‌లు కాశ్మీర్ కు చేరుకోవ‌చ్చు. రైల్వేశాఖ మంత్రిత్ర‌శాఖ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో చీనాబ్ రైలు బ్రిడ్జీ ఫొటోలు షేర్ చేసింది. అందులో వంతెన కింద మేఘాలు  క‌నిపిస్తూ ఉన్నాయి.  ప్ర‌స్తుతం నెటిజ‌న్లను ఆక‌ట్టుకుంటున్నాయి.

Advertisement

 

చీనాబ్ న‌దిపై నిర్మించిన ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన ఎత్తు 359 మీట‌ర్లు. అద్భుత‌మైన ఇంజినీరింగ్ న‌మూనాను ప్ర‌తిబింభిస్తుంది. ఈ బ్రిడ్జీ జ‌మ్మూకాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఉంది. ప్ర‌ధాన లోయ‌ను దేశంలోని మిగిలిన ప్రాంతాల‌తో క‌లుపుతుంది. ఈ వంతెన పొడ‌వు 1,315 మీట‌ర్లు. నిర్మాణానికి దాదాపు 1500 కోట్లు ఖ‌ర్చ‌వుతుంది. ఈ వంతెన బ‌ల‌మైన గాలుల‌తో పాటు భూకంపాల‌ను త‌ట్టుకుంటుంది.

చీనాబ్ రైలు వంతెన డిసెంబ‌ర్ 2009లో సిద్ధం అవుతుంద‌ని గతంలోనే వెల్ల‌డించారు. సెప్టెంబ‌ర్ 2008లో వంతెన స్థిర‌త్వం, భ‌ద్ర‌త గురించి ఆందోళ‌న‌ల కార‌ణంగా ప్రాజెక్ట్ నిలిపేశారు. ఆ త‌రువాత 2010లో మ‌రొక‌సారి వంతెన ప‌నుల‌ను ప్రారంభించారు. 2010లో మ‌ళ్లీ దీని ప‌నులు ప్రారంభం కాగా.. ఐదేండ్ల అన‌గా 2015 నాటికి పూర్తి చేయాల‌ని ల‌క్ష్యం నిర్దేశించ‌గా ఎప్ప‌టిక‌ప్పుడు త‌లెత్తుతున్న స‌మ‌స్య‌ల‌తో సాధ్యం కాలేదు.

ముఖ్యంగా జ‌మ్మూకాశ్మీర్‌లో నిర్మిస్తున్న ఈవంతెన నాణ్య‌మైన ఉక్కు, కాంక్రీట్‌ను ఉప‌యోగిస్తున్నారు. గంట‌కు 266 కి.మీ. వేగంతో వీచే గాలుల‌ను సైతం త‌ట్టుకోగ‌ల‌దంటే ఈ వంతెన బ‌లాన్ని అంచ‌నా వేయ‌వ‌చ్చు. ఆప్కాన్స్ సంస్థ‌కు ఈ వంతెన నిర్మాణ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. నిర్మాణంలో కొంక‌న్ రైల్వే, డీఆర్‌డీఓ కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జీ అందుబాటులోకి రానున్న‌ది.

Also Read :  Mohanbabu : మోహన్ బాబు రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి కారణం అదేనా …!

Visitors Are Also Reading