Home » ‘జై బాలయ్య’ పాటకి స్టెప్స్ ఈ సినిమాలో నుంచి కాపీ చేశారట ! నెటిజన్స్ వెతికి మరీ ఇచ్చిపడేసారు !

‘జై బాలయ్య’ పాటకి స్టెప్స్ ఈ సినిమాలో నుంచి కాపీ చేశారట ! నెటిజన్స్ వెతికి మరీ ఇచ్చిపడేసారు !

by Anji
Ad

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యంలో మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం అఖండ‌. ప్ర‌గ్యాజైశ్వాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌కాంత్‌, పూర్ణ‌, ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత‌మందించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య గ‌త ఏడాది డిసెంబ‌ర్ 02న విడుద‌లై ఈ సినిమా విజ‌యం సాధించిన‌ది. ఇటీవ‌లే డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నా.. బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతూనే ఉన్న‌ది. ఈ త‌రుణంలో ఈ సినిమా త‌మిళంలో ఇవాళ విడుద‌ల అవుతోంది.

Also Read: దంగల్ నటిపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు

Advertisement

Jai Balayya Lyrics in Telugu జై బాలయ్య - Akhanda - TeluguTracks

ముఖ్యంగా ఈ చిత్రానికి థ‌మ‌న్ మ్యూజిక్ హైలెట్ అని చెప్ప‌వ‌చ్చు. అఖండ విజ‌యంలో థ‌మ‌న్ మ్యూజిక్ మ్యాజిక్ చాలా కీల‌క‌మే. అయిన‌ప్ప‌టికీ.. ఇందులో జై బాల‌య్య పాటకు ఓ రేంజ్‌లో రెస్పాండ్ వ‌చ్చింది. మ్యూజిక్ ల‌వ‌ర్స్‌కు బాల‌య్య అభిమానుల‌కు ఈ చిత్రంలోని బాల‌య్య పాట భ‌లే న‌చ్చేసింద‌ట‌. అయితే గ‌తంలో థ‌మ‌న్ అన్ని సినిమాల‌కు మ్యూజిక్‌ను కాపీ చేస్తార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి. తాజాగా బాల‌కృష్ణ న‌టించిన అఖండ సినిమాలో అద్భుత‌మైన మ్యూజిక్ అందించిన‌ప్ప‌టికీ ఓ సాంగ్‌లో డ్యాన్స్ కాపీ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

Ramayya Vasthavayya Movie | Pandaga Chesko Promo Song - Jr. NTR, Samantha, Shruthi Hasan - video Dailymotion

అఖండ సినిమాలోని జై బాల‌య్య సాంగ్ లో బాల‌య్య వేసిన స్టెప్పుల‌ను అదేవిధంగా కాపీ చేశార‌ట‌. నెటిజ‌న్లు వెతికి మ‌రీ చూపించారు. అది ఏ సినిమాలోనిదో కాదు. బాల‌య్య అన్న కొడుకు అయిన జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన రామ‌య్య వ‌స్తావ‌య్య సినిమాలోని సాంగ్. 2013లో వచ్చిన రామ‌య్య‌వ‌స్తావ‌య్యా పాట‌ల‌ను థ‌మ‌న్ స్వ‌ర‌ప‌రిచారు. సాహిత్యాన్ని శ్రీ‌మ‌ణి, శ్రీ‌మ‌ణి, సాహితి, అనంత శ్రీ‌రామ్‌, భాస్క‌ర‌భ‌ట్ల రాసారు. న‌వీన్‌, రాహుల్‌, రంజీత్‌, శంక‌ర్ మ‌హ‌దేవ‌న్‌, శ్రీ‌య‌, ఘోష‌ల్ సుచిత‌, రాహుల్ నంబియార్ పాడారు. ఇప్పుడు యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకెళ్తోంది బాల‌య్య సాంగ్‌. బాల‌కృష్ణ‌తో పాటు ప్ర‌జ్ఞా జైస్వాల్ స్టెప్స్ కూడా ఈ పాట‌కు హైలెట్‌గా నిలిచాయి.

Also Read: హీరోయిన్ తో ఆర్జీవీ ముద్దులు…ముస‌లాడే కానీ మ‌హానుభావుడంటూ ట్రోల్స్..!

Visitors Are Also Reading