Home » వ్య‌వ‌సాయ కూలీగా ఆ స్టార్ హీరోయిన్‌..!

వ్య‌వ‌సాయ కూలీగా ఆ స్టార్ హీరోయిన్‌..!

by Anji
Ad

సెలబ్రిటీలు షూటింగ్ కి గ్యాప్ రావడం.. సమయం దొరికినప్పుడల్లా వారికి ఇష్టమైన పనులు చేసుకుంటూ గడుపుతుంటారు. కొంత మంది సెలబ్రిటీలు అయితే వ్యవసాయ పనులు కూడా చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా షూటింగ్ నుంచి ఖాళీ సమయం దొరకడంతో వ్యవసాయం చేస్తూ కెమెరాకు చిక్కింది. ప్రస్తుతం మా హీరోయిన్ తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో బిజీగా నటిస్తోంది. ఆమె మరెవరో కాదు.. ఇటీవల శ్యామ్ సింగరాయ్  సినిమాతో  అందరినీ మెప్పించిన సాయి పల్లవి.

Advertisement

Advertisement

ప్రస్తుతం షూటింగ్ నుంచి గ్యాప్ దొరకడంతో సాయి పల్లవి తన ఇంటి వద్ద ఉన్న పొలాలలో కి వెళ్ళింది. అక్కడ అ వ్యవసాయ కూలీలతో కలిసి పని చేసింది. వ్యవసాయ కూలీలు అక్కడ అల్లం పంటను బయటకి తీస్తుండగా సాయి పల్లవి కూడా వారితో చేరి అల్లం పంటను బయటకు తీసింది. రోజంతా వారితో కలిసి పని చేసింది. ఉగాది పండుగ సందర్భంగా సాయి పల్లవి అలా పొలం పనులు చేసింది. పొలంలో ఉన్న కూలీలతో కలిసి ఫోటోలు తీసుకొని, అల్లం పంట కు సంబంధించిన ఫోటోలు తీసుకొని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఇక నెటిజన్లు, అభిమానులు, సెలబ్రిటీలు సాయి పల్లవిని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read :  శుభ‌గృహ‌ యాడ్ కోసం చిరంజీవి క‌ళ్లు చెదిరే రెమ్యూన‌రేష‌న్..ఎంతంటే..!!

Visitors Are Also Reading