Home » ఆ స్టార్‌ ఆల్‌రౌండర్‌ సంచలన నిర్ణయం..కుటుంబం కోసం క్రికెట్ కి వీడ్కోలు..!

ఆ స్టార్‌ ఆల్‌రౌండర్‌ సంచలన నిర్ణయం..కుటుంబం కోసం క్రికెట్ కి వీడ్కోలు..!

by Anji
Ad

సౌతాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పి తన అభిమానులను ఆశ్చర్యపరిచాడు. వన్డే ప్రపంచ కప్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ప్రిటోరియస్ నిర్ణయం సఫారీ జట్టుకు చేదు వార్త అనే చెప్పాలి. దక్షిణాఫ్రికా తరుపున 30 టీ-20లు, 27 వన్డేలు, 3 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన 33 ఏళ్ల ప్రిటోరియస్ గత సంవత్సరం అక్టోబర్ లో భారత్ లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇండోర్ లో జరిగిన మూడో టీ-20 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ని 8 పరుగుల వద్ద ఔట్ చేసి టీమిండియాకి షాక్ ఇచ్చాడు ప్రిటోరియస్.

Advertisement

సౌత్ ఆఫ్రికా తరపున రెండు ప్రపంచ కప్ లు ఆడాడు. టీ-20లతో పాటు ఇతర ఫార్మాట్లపై  దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తన రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్. సౌత్ ఆఫ్రికా తరపున అంతర్జాతీయ టీ 20 క్రికెట్ లో అత్యుత్తమ బౌలింగ్ గా అతని పేరు మీదే ఉంది. పాకిస్తాన్ పై ప్రిటోరియస్ 17 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు స్టార్ ఆల్ రౌండర్.గత  ఏడాది టీ-20 ప్రపంచ కప్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. గాయం కారణంగా టోర్నమెంట్ ముందు తప్పుకున్నాడు. ప్రిటోరియస్ దక్షిణాఫ్రికా తరపున 3 టెస్ట్ మ్యాచ్ లో  మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా 27 వన్డేలలో 35 వికెట్లను తీసాడు. 30 టీ 20 మ్యాచ్ లు ఆడి 35 వికెట్లు తీశాడు. 

Advertisement

Also Read :  అశ్విని నాచప్ప గుర్తుందా.. ఆమె కూతుర్లు ఎంత అందంగా ఉన్నారంటే..?

ఐపీఎల్ లో ఈ ఏడాది ప్రిటోరియస్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలుకి పలికినప్పటికీ రాబోయే రోజుల్లో డ్వేన్ చాలా బీజీగా ఉండనున్నాడు. ఎస్ఏ20 లీగ్ ఫిబ్రవరి 11 వరకు కొనసాగుతుంది. ఆ తరువాత ఐపీఎల్ లో బిజీ కానున్నాడు. టీ 20లతో పాటు పొట్టి ఫార్మాట్ లపై  ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ అయినా సరే నాకు నచ్చినట్టుగా నేను ఆడగలిగే స్వేచ్ఛ లభించింది. అదేవిధంగా నా కుటుంబానికి తగినంత సమయం కేటాయించగలుగుతానని.. ప్రయాణంలో ఇంతవరకు తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ వీడ్కోలు ప్రకటనలో తెలిపాడు ప్రిటోరియస్. 

Also Read :  Balakrishna: వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముందు బాలకృష్ణ డ్రింక్ చేశారా..?

 

Visitors Are Also Reading