Home » Goa Assembly Election 2022: గోవాలో బీజేపీ గెలుపు వెనుక తెలుగోడు కిష‌న్‌రెడ్డి పాత్ర కీల‌కం..!

Goa Assembly Election 2022: గోవాలో బీజేపీ గెలుపు వెనుక తెలుగోడు కిష‌న్‌రెడ్డి పాత్ర కీల‌కం..!

by Anji
Ad

గోవాలో జరిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిచిందంటే అందుకు కార‌ణం కిషన్‌రెడ్డి కృషి చాలానే ఉంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కు వెన్నుద‌న్నుగా కిష‌న్ రెడ్డి నిలిచారు. గోవా ఎన్నిక‌ల స‌హ ఇన్‌చార్జీగా చాలా గ్రౌండ్ వ‌ర్క్ చేశారు. అభ్యర్థుల ఎంపిక ద‌గ్గ‌ర నుంచి పోస్ట‌ర్ల డిజైనింగ్ ప్ర‌చారం.. రూట్ మ్యాప్స్ ప్ర‌త్య‌ర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్లే వ్యూహాలు.. ఇలా కిష‌న్‌రెడ్డి ద‌గ్గ‌ర ఉండి చూసుకున్నారు.

Advertisement

Advertisement

గోవా రాష్ట్రంలో స్థానిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి అవ‌స‌ర‌మైన అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌డం ద్వారా స్థానిక స్థానిక ప్ర‌జ‌ల్లో విశ్వాసం క‌ల్పించేలా చూసుకున్నారు. ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా అక్క‌డ అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఇండియాలోనే టాప్ టూరిస్ట్ స్పాట్ కావ‌డంతో టూరిజం మంత్రిగా ముందుండి బాధ్య‌త‌లు చూసుకున్నారు కిష‌న్‌రెడ్డి. కార్య‌క‌ర్త‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడూ మోటివేట్ చేయ‌డం.. బీజేపీ వ్యూహాలు, ప‌థ‌కాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్లేవిధంగా చూసుకున్నారు. ముఖ్యంగా కిష‌న్‌రెడ్డి క్రైస్త‌వ కార్య‌క‌ర్త‌ల‌ను గుర్తించి టికెట్స్ వ‌చ్చే విధంగా చూశారు. క్రిస్టియ‌న్ ఓట‌ర్ల‌ను బీజేపీ ఆక‌ర్షించింది. ఓట్లు చీలకుండా అసంతృప్తుల‌ను బుజ్జ‌గించ‌డం, ప్ర‌త్యామ్నాయాలు చూప‌డం స‌క్సెస్ అవ్వ‌డంలో కిష‌న్‌రెడ్డి కీల‌క పాత్ర పోషించారు.

Visitors Are Also Reading