Home » వ‌ర‌ల్డ్‌లోనే మొద‌టిసారి రైట్ టూ రిపేర్ యాక్ట్‌..!

వ‌ర‌ల్డ్‌లోనే మొద‌టిసారి రైట్ టూ రిపేర్ యాక్ట్‌..!

by Anji
Ad

వినియోగారుల హ‌క్కుల‌కు కాపాడేందుకు న్యూయార్క్ చ‌ట్ట స‌భ‌ న‌డుం బిగించింది. ముఖ్యంగా ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల విష‌యంలో ఎంతో కాలంగా ఉన్న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపే దిశ‌గా మొద‌టిసారిగా అడుగు వేసింది. ప్ర‌పంచంలోనే మొద‌టి సారి ఫెయిర్ రిపేర్ యాక్ట్ ను అమ‌లు కోసం చ‌ట్టాన్ని సిద్ధం చేసిన‌ది.

Advertisement

 

డిజిట‌ల్ ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌కు ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా తిరిగి మాన్యుఫ్యాక్చ‌ర‌ర్ సూచించిన చోట‌నే రిపేర్ చేయించుకోవాల్సి వ‌స్తోంది. బ‌య‌ట చేయిస్తే వారంటీ, గ్యారెంటీలు లేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు ఎదురు అవుతాయి. కొన్ని సంద‌ర్భాల్లో రిపేర్ ఎలా చేయాలో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంటుంది. దీంతో వినియోగ‌దారులు అనివార్యంగా త‌యారీదారు మీదే ఆధార‌ప‌డాల్సి వ‌స్తోంది. ఇలాంటి అనేక స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే దిశ‌గా న్యూయార్క్ చట్ట‌స‌భ న‌డుము బిగించింది.

Advertisement

న్యూయార్క్ చ‌ట్ట‌స‌భ తాజా నిర్ణ‌యం ప్ర‌కారం.. ఇక‌పై డిజిట‌ల్ ఎల‌క్ట్రానిక్స్ తయారీ దారులు ఏదైనా ప్రోడ‌క్ట్‌ను మార్కెట్‌లోకి తెచ్చిన‌ప్పుడు అందులో త‌లెత్తే స‌మ‌స్య‌లు వాటికి ప‌రిష్కారముల‌ను కూడా సూచించాల్సి వ‌స్తుంది. ఇక కొనుగోలు దారులు రిపేర్ల కోసం త‌యారీ దారుల‌తో పాటు స్థానికంగా ఉండే రిపేర్ షాపుల‌ను కూడా ఆశ్ర‌యించ‌వ‌చ్చు. సాధ్య‌మైతే అందుబాటులో ఉన్న స‌మాచారం ఆధారంగా వారే ప‌రిష్కారం వెతుక్కోవ‌చ్చు. అంతేకాదు.. రిపేర్‌కు అవ‌స‌రం అయినా విడి భాగాలు, ఇత‌ర టూల్స్ అమ్మ‌కంపై త‌యారీ దారులు విధించిన ఆంక్ష‌లు కూడా తొల‌గిపోతాయి.

Also Read : 

చ‌ర‌ణ్‌, చైత‌న్య‌, రామ్ సినిమాల‌తో చాలా న‌ష్ట‌పోయా.. ఆ డిస్ట్రిబ్యూట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

మెగా అభిమానుల‌కు శుభ‌వార్త.. త్రివిక్ర‌మ్‌తో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌..?

Visitors Are Also Reading