Home » ఆ హీరోయిన్ తో SR:ఎన్టీఆర్ పెళ్లి పీటల దాకా వెళ్లి ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

ఆ హీరోయిన్ తో SR:ఎన్టీఆర్ పెళ్లి పీటల దాకా వెళ్లి ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారకరామారావు ఒక సెన్సేషనల్ హీరోగా చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ఎదుగుతూ ఇండస్ట్రీని కూడా టాప్ స్థాయిలో నిలిపారని చెప్పవచ్చు. అలాంటి అన్న ఎన్టీఆర్ పెళ్లి గురించి మీకు తెలియని కొన్ని విషయాలు చూద్దాం.. హీరో నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. 63 సంవత్సరాల వయసులో లక్ష్మీపార్వతిని రెండో వివాహం చేసుకోవడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఈ కారణంతోనే ఎన్టీఆర్ ని కుటుంబ సభ్యులు దూరం పెట్టారు. అనంతరం పదవిపోవడం ఆవేదనతో మరణం సంభవించడం జరిగాయి.

Advertisement

Advertisement

కానీ ఎన్టీఆర్ ఈ లక్ష్మీ పార్వతి కంటే ముందుగా స్టార్ హీరోయిన్ అయిన కృష్ణకుమారిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట. ఈ వ్యవహారం దాదాపు పెళ్లి వరకు వెళ్లిందట. కానీ అనూహ్యంగా విడిపోవడం జరిగింది. ఒక సందర్భంలో కృష్ణకుమారి చెల్లెలు షావుకారు జానకి ఈ విషయాలను బయటపెట్టారు. కృష్ణ కుమార్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ఎన్టీఆర్ ని నేను నిలదీశానని తిట్టానని ప్రచారం జరిగింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదని, ఎన్టీఆర్ అంటే నాకు చాలా గౌరవం ఉండేదని, అంతేకాకుండా ఆయన కూడా నన్ను అభిమానించే వారిని అన్నది.

ఇక అప్పట్లో ఎన్టీఆర్ కృష్ణకుమారి వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం మాత్రం చాలా జరిగింది. కానీ ఈ జంట వ్యవహారం పెళ్లి వరకు వెళ్లిన విషయం నిజమే కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో అది ఆగిపోయిందని అన్నది. ఈ వేదనతో కృష్ణకుమారి చాలా కృంగిపోయిందని దీనివల్ల కెరియర్ చాలా డల్ అయిందని తెలియజేసింది. ఆ తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని కృష్ణకుమారి జీవితంలో సెట్ అయిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

also read:

Visitors Are Also Reading