Home » ఠాగూర్ సినిమాలో సౌందర్య చేయకపోవడానికి కారణం.. ఏంటంటే..?

ఠాగూర్ సినిమాలో సౌందర్య చేయకపోవడానికి కారణం.. ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే ది బెస్ట్ చిత్రాల్లో ఠాగూర్ సినిమా మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ సినిమా ద్వారా మెగాస్టార్ ఆకాశమంత ఎత్తుకెదిగారు. ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అంటే ఠాగూర్ అని చెప్పవచ్చు. లంచాల వల్ల మన దేశం ఏ విధంగా దెబ్బతింటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు డైరెక్టర్.. అలాంటి మూవీ విశేషాలు తెలుసుకుందాం.. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కింది. తమిళంలో విజయకాంత్ హీరోగా రమణ మూవీ తెరకెక్కింది. అయితే మధు అనే వ్యక్తి ఈ మూవీ తెలుగులో చిరంజీవికి బాగా సెట్ అవుతుందని చెప్పారట.

Advertisement

also read:హాస్యనటి పాకీజా గుర్తుందా.. కనీసం ఓ పూట తినడానికి దిక్కులేని పరిస్థితుల్లో రోడ్డుపై..!!

ఈ లోగా తమిళంలో ఆ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో, వెంటనే చిరు అల్లు అరవింద్ ను రంగంలోకి దింపి ఈ సినిమా హక్కులను దక్కించుకున్నారు. తర్వాత పరుచూరి బ్రదర్స్ కు మన తెలుగువారి ఆలోచనలకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేయమని చెప్పారు. దీంతో వారు రెండు వారాల్లో కథంతా రెడీ చేశారు. ముందుగా మురగదాస్ డైరెక్టర్ గా తీసుకుందామనుకున్నారు. కానీ చివరికి వివి వినాయక్ కన్ఫామ్ చేయడంతో అతని తలరాత మారిందని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ముందుగా శ్రేయ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసేసారు. ఇక రెండో హీరోయిన్ గా సౌందర్య ని కావాలని ఆమెను సంప్రదించారు.

Advertisement

కానీ ఇదే సమయంలో సౌందర్యకు డేట్స్ కుదరకపోవడంతో మళ్లీ మాధురి దీక్షిత్ ను సంప్రదించారు. ఆమెకు కూడా వీలు కాకపోవడంతో చివరికి జ్యోతికను ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్. ఇక చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టు ఎన్నో మార్పులు చేర్పులు చేసి సినిమాను తెరకెక్కించారు. కానీ ఈ సినిమా అనుకున్న స్థాయి కంటే 100 రేట్లు లాభాలను తెచ్చి పెట్టడమే కాకుండా మంచి పేరు తీసుకువచ్చిందట. టోటల్ గా 26 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసిందట. 253 కేంద్రాల్లో 100 రోజులు ఆడి, చిరంజీవి సినీ కెరియర్ లోనే టాప్ 5 చిత్రాల్లో ఒకటిగా నిలిచిందని చెప్పవచ్చు.

also read:

Visitors Are Also Reading