తన సినిమాలోని ప్రతి పాత్రను అందంగా, వివరణాత్మకంగా మలుస్తుంటాడు కాబట్టి రాజమౌళిని జక్కన్న అని కీర్తిస్తుంటారు. మరి అసలైన జక్కన్న ఎవరు? ఆయన స్పెషాలిటీ ఏంటో ఈ సందర్భంగా తెలుసుకుందాం.
జక్కన కర్ణాటకలోని కైదల అనే గ్రామంలో జన్మించాడు. 12వ శతాబ్దంలో కర్ణాటకని పాలించిన హోయసాలుల ఆస్థాన శిల్పి జక్కన్న. కర్ణాటకలోని బేలూరు, హళిబేడు ఆలయాలలోని శిల్పాలను చెక్కింది జక్కన్నయే, బేలూరు చెన్నకేశవ ఆలయంలోని శిల్పాలను చూస్తే తెలుస్తుంది జక్కన్న పనితనం! రాతి మీద ముక్కు, మూతి చెక్కడమే కష్టం అలాంటిది తల వెంట్రుకలను కూడా కళాత్మకంగా చెక్కిన గొప్ప నేర్పరి జక్కన్న!
Advertisement
తండ్రి కొడుకుల సవాల్:
జక్కన తనకు కొడుకు పుట్టాక దేశాటనం చేస్తూ ఎన్నో దేవాలయాను నిర్మిస్తుంటాడు. జక్కన కొడుకు ఢంకన తండ్రిని వెతుకుతూ బయలుదేరుతాడు. ఈ క్రమంలో బేలూరులో జక్కన చెక్కిన ఒక శిల్పంలో లోపం ఉందని గుర్తిస్తాడు ఢంకన ( చిన్నప్పుడే వదిలి రావడంతో అతనే తండ్రి అని కొడుకుకు, అతనే కొడుకని తండ్రికి తెలియదు).
Advertisement
దీంతో కోపోద్రిక్తుడైన జక్కన ఆ లోపాన్ని నిరూపిస్తే తన కుడి చేతిని నరుక్కుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఢంకన ఆ లోపాన్ని నిరూపిస్తాడు. జక్కన ఇచ్చిన మాట ప్రకారం తన కుడి చేతిని తానే నరుక్కుంటాడు. ఆ తర్వాత వీరిద్దరూ తండ్రికొడుకులని తెలుసుకుంటారు.
చేయి తిరిగి వచ్చిన ఐతిహ్యం :
జక్కన క్రిడాపురలో చెన్నకేశవ దేవాలయం నిర్మించగా చెన్నకేశవ స్వామే స్వయంగా జక్కనకు తెగిన కుడి చేయిని తిరిగి ప్రసాదించాడని ఐతిహ్యం. అందుకే క్రిడాపురను కైడల అని వ్యవహరిస్తారు. కన్నడలో కై అంటే చేయి అని అర్థం.
Also Read: నా భర్త, కొడుకు వదిలేసి వెళ్లిపోయారు…నటి సుధ ఎమోషనల్..!