మన శరీరంలో కిడ్నీలనేవి కీలకమైన పాత్రను పోషిస్తాయి. చాలా వరకు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది వయసు మళ్లిన వారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా మొదటి నుంచి అనేక అనారోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా కిడ్నీ సమస్యలు రావచ్చు. ముఖ్యంగా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వల్లే నాశనం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కిడ్నీలకు వైరస్ సోకకుండా ఉండేందుకు కొన్ని రకాల చిట్కాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ చిట్కాల వల్ల కిడ్నీ సమస్య ఉన్నవారిలో తీవ్రతరం కాకుండా కాపాడుకోవచ్చు.. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం ..
పండ్లు :
మనం తినే పండ్లలో ఎక్కువగా వాపును తగ్గించే గుణం ఉండటం వల్ల లాభం చేకూరుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వాతావరణంలో వచ్చే మార్పులు సందర్భంగా ముందుగా కోసిన పండ్లు తినేయడం మానేయండి. ముఖ్యంగా తాజాగా ఉన్న పండ్లను నీటిలో కడిగి పండ్లపై ఉన్న తొక్కను తీసి పండ్లు తినాలని నిపుణులు అంటున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలని వీరికి వైరస్ తొందరగా సోకే అవకాశం ఉంటుందని వారు తెలియజేస్తున్నారు.
కలుషితమైన ఆహార పదార్థాలు:
Advertisement
Advertisement
సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే వాతావరణం చల్లగా ఉండటం వల్ల రోడ్లపై నీరు నిలవడమే కాకుండా డ్రైనేజీ వ్యవస్థ కూడా పనిచేయదు. దీనివల్ల మన ఇండ్లలో కూడా కలుషితం ఏర్పడుతుంది. అపరిశుభ్రం వల్ల భోజన నీటి కాలుష్యం జరిగి ఈ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వానాకాలంలో ఈ వైరస్ల నుండి జాగ్రత్తగా ఉండాలంటే ఏదైనా ఆహార పదార్థాలు తీసుకోవడానికి ముందు చేతులను శుభ్రంగా చేసుకోవాలి.
వ్యాయామం:
ముఖ్యంగా ఏ వ్యాధి బారిన పడకుండా ఉండాలి అంటే ప్రతిరోజు మనం వ్యాయామం చేయడం చాలా అవసరం. వ్యాయామం, యోగ, శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల కిడ్నీ సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు .
also read: