Home » ఈ నెల 27 నుంచి తెలంగాణలో టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ

ఈ నెల 27 నుంచి తెలంగాణలో టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ

by Bunty

తెలంగాణలోని టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. టీచర్ల బదిలీలు, పదోన్నతులకు మార్గం సుగమయింది. ఈనెల 27 నుంచి దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని మరియు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.


ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించి శుక్రవారం సాయంత్రం బషీర్ బాగ్ లోని మంత్రి చాంబర్ లో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన ఇతర అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం అయ్యారు. పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. త్వరలోనే పూర్తి వివరాలతో కూడిన షెడ్యూల్ విడుదల చేయనున్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పక్కాగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సబితా ఇంద్రారెడ్డి అధికారులను కోరారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం అనుమతినిచ్చినందున ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా, సజావుగా పూర్తయ్యేలా అప్రమత్తంగా ఉండాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

Read also : Unstoppable Pawan Kalyan: అన్‏స్టాపబుల్ గ్లింప్స్ వచ్చేసింది.. పవన్ ను ఓ ఆట అడుకున్న బాలయ్య !

Visitors Are Also Reading