ప్రస్తుతం బుల్లితెరపై యాంకరింగ్ తో ఎంతటి వారినైనా కట్టిపడేసే సామర్థ్యమున్న యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సుమ కనకాల మాత్రమే. ఆమె తన మాటలతో ఎంతటి షో అయినా సక్సెస్ఫుల్ అయ్యేలా చేస్తుంది. అయితే సుమ కనకాల ప్రస్తుతం యాంకరింగ్ లోనే కాకుండా ఓ వైపు సినిమాల్లో, మరోవైపు ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సుమ ఒక పట్టు చీర షాపింగ్ చేశారు.
Advertisement
దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు సుమ. ఇక ఆ పట్టు చీరల షాపింగ్ కోసం సింఘానియా అనే షాపింగ్ మాల్ వెళ్లారు. షాపింగ్ మాల్ యొక్క ప్రాముఖ్యత అక్కడ పట్టు చీరల గురించి వివరించారు. షాపింగ్ మాల్ లో పది వేల నుంచి పది లక్షల ధరలు గల చీరల వరకు ఉంటాయని తెలియజేశారు. ఈ చీర కొనడానికి వెళ్లి నటువంటి సుమ అక్కడ సేల్స్ మ్యాన్ తో కూడా చమత్కారంగా మాట్లాడారు. తనకు 15 వేల లోపు పట్టు చీర కావాలని సుమ చెప్పడంతో, ఇది మీ రేంజ్ కాదు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళండి అని చెప్పారు.
Advertisement
అలా అన్న సేల్స్‌మెన్ మాటలకు సుమా స్పందిస్తూ మీరు మా రేంజ్ ఏదో అనుకుంటారు, కానీ మేము తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడే కొనాల్సి ఉంటుంది అంటూ కౌంటర్ వేసింది. ఇకపోతే షాపింగ్ మాల్ లో ఉన్న చీర ని చూస్తూ దీని ధర ఎంత అని అడగగానే ఒకేసారి రెండు లక్షల రూపాయలు అని చెప్పారు. వామ్మో మా వివాహం లో అయితే నేను కట్టుకున్న చీర ధర 11000 అంటూ ఆమె పెళ్లి చీర ధర చెప్పేసారు సుమ. అప్పట్లో ఆ 11000 అంటే చాలా కాస్ట్లీ అన్నారు .
also read:
- Jr.. ఎన్టీఆర్ కు పెళ్లి సమయంలో లక్ష్మీ ప్రణతి పెట్టిన కండిషన్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
- విగ్నేష్ చేసిన ఆ చిలిపి పనికి..వాంతింగ్స్ తో హాస్పిటల్లో చేరిన నయనతార..!!