భారతదేశంలో ఒక కారు కొనడానికి కొందరు సాహసం చేస్తుంటే.. మరి కొందరు సంపన్నులు మాత్రం అత్యంత ఖరీదైన కార్లను చాలా సింపుల్ గా కొనేస్తుంటారు. ఈ క్రమంలోనే కార్లు కూడా అత్యంత ఖరీదైనవిగా మారుతున్నాయి. అలాంటి జాబితాలోనిదే రోల్స్ రాయిస్ గోస్ట్ కారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా ఉంది. ఈ కారు ఇప్పుడు ప్రపంచం అపర కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గ్యారేజీలోకి వచ్చి వాలింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. వారి కుటుంబానికి రోల్స్ రాయిస్ తో సహా అనేక లగ్జరీ కార్లు ఇప్పటికే ఉన్నాయి. అయితే తాజాగా వారి గ్యారేజీలో రెండో తరం రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కూడా వచ్చి చేరిపోయింది. పెట్రా గోల్డ్ ఫినిష్ తో కూడిన ఈ లగ్జరీ కారు ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టడం కనిపించింది. రోల్స్ రాయిస్ గోస్ట్ ధర రూ. 6.95 కోట్లతో స్టార్ట్ అవుతుంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర దాదాపు రూ. 7.95 కోట్లుగా ఉంటుంది. కొత్త పెట్రా గోల్డ్ రోల్స్ రాయిస్ గోస్ట్ ట్రాఫిక్ సిగ్నల్ ను దాటుతుండడం కనిపించింది. రాత్రిపూట ఆ కారు ఓ భవనం నుంచి బయటకు వెళ్లడం కూడా కనిపించింది.
Advertisement
Advertisement
ఈ కొత్త తరం సూపర్ లగ్జరీ కారు 2020 సంవత్సరంలో ప్రారంభించబడింది. దాన్ని EWB వేరియంట్ ఇప్పుడు అంబానీ గ్యారేజీలోకి వచ్చింది.ఈ కొత్త సూపర్ లగ్జరీ కారులోని ఇంజన్ కూడా చాలా శక్తివంతమైనది. ఈ మోడల్ లో 563hp పవర్, 820Nm టార్క్ ఉత్పత్తి చేసే 6.75 లీటర్ V12 ఇంజన్ తో తయారు చేశారు. ఇందులో 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది. ఇది కేవలం 4.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. భద్రత లక్షణాలలో హెడ్-అప్ డిస్ ప్లే, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, 360 డిగ్రీ కెమెరా సిస్టమ్ ఇందులో ఉన్నాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ?
మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా..?