సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం విధితమే. తన కెరీర్లో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వచ్చిన మహేష్ బాబు. ఇటీవల వచ్చిన సరైనోడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. సరైనోడు కంటే ముందు సరిలేరు నీకెవ్వరూ చిత్రం 2020 సంక్రాంతి బరిలో నిలిచింది. సంక్రాంతికి మహేష్ సినిమా రావడం హిట్ కొట్టడం సాధారణమే. ముఖ్యంగా పదిహేడేళ్ల కిందట కూడా మహేష్ బాబు ఒక్కడు సినిమా సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ కొట్టింది. గుణశేఖర్ దర్శకత్వంలో ఆ సినిమా అప్పట్లో రికార్డులనే సృష్టించింది. 2003లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇదిలా ఉండగా ఈ చిత్రం టైటిల్ విషయంలో వివాదంలో ఇరుకున్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ఒక్కడు సినిమా కథను దర్శకుడు గుణశేఖర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచే రాయడం ప్రారంభించాడట. రాజకుమారుడు సినిమా షూటింగ్ నడుస్తుండగానే అదే వైజయంతి మూవీస్ బ్యానర్ లో గుణశేఖర్ చిరంజీవితో చూడాలని ఉంది సినిమా నిర్మిస్తున్నారు. ఆ సమయంలో మహేష్ బాబుతో ఏర్పడిన పరిచయంతో గుణశేఖర్ ఈ కథను మహేష్ కి చెప్పారట. మహేష్ కి వెంటనే కథ నచ్చేసింది. గుణశేఖర్ కి చిరంజీవితో చేసిన మృగరాజు సినిమా రూపంలో పెద్ద డిజాస్టర్ ఎదురైంది. మహేష్ బాబు మాత్రం గుణశేఖర్ పై ఎంతో నమ్మకంతో ఉన్నాడట. ఈ సినిమా కి ఇద్దరు నిర్మాతలు తప్పుకోవడంతో నిర్మాత ఎం.ఎస్. రాజు ఫ్రేమ్ లోకి వచ్చారు.
Advertisement
Advertisement
అప్పట్లో రూ.14కోట్ల బడ్జెట్ తో ఒక్కడు సినిమా తెరకెక్కింది. ఈ సినిమా 2003 సంక్రాంతి బరిలో నిలిచింది. సినిమా తొలిరోజు తొలి ఆటకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు ముందుగా అతడే ఆమె సైన్య అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారట. అయితే అప్పటికే ఆ టైటిల్ మరొకరు రిజిస్టర్ చేసుకోవడంతో గుణశేఖర్ ఎంత బతిమిలాడినా ఒప్పుకోలేదు. ఆ తరువాత కబడ్డీ అన్న పేరు అనుకున్నారు. కానీ చివరికి గుణశేఖర్ ఒక్కడు అన్న టైటిల్ చెప్పగానే మహేష్ ఒకే చెప్పేశారట. అలా ఒక్కడు సినిమా టైటిల్ పుట్టి మహేష్ కెరీర్ నే మార్చేసింది. ఇక అప్పటివరకు ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రమే చూసే మహేష్ సినిమాలకు యూత్ కనెక్ట్ అయిన సినిమా ఒక్కడు. ఆ సినిమాతోనే హీరోగా మహేష్ మంచి ఫామ్లోకి వచ్చారు.
Also Read :
రే చీకటి అంటే ఏంటి..? అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
మెగా ఫ్యామిలీలో కోల్డ్ వార్.. చిరంజీవిని టార్గెట్ చేసిన తమ్ముళ్లు, మేనల్లుడు..!